మ‌హాన‌టి కలెక్షన్ల సునామీ

Last Updated on by

మ‌హాన‌టి విడుద‌లై అప్పుడే మూడు వారాలు అయిపోయింది. నాలుగో వారంలోనూ ఈ చిత్రం దూకుడు ఏ మాత్రం త‌గ్గ‌లేదు. వీకెండ్స్ వ‌చ్చేస‌రికి ఇంకా పెరుగుతున్నాయి క‌లెక్ష‌న్లు. ఈ మ‌ధ్య కాలంలో రంగ‌స్థ‌లం త‌ర్వాత అంత‌గా బాక్సాఫీస్ ను దున్నేస్తుంది ఈ చిత్రం. కాక‌పోతే అది దానికి త‌గ్గ రేంజ్ లో క‌లెక్ష‌న్లు తెస్తే.. ఇప్పుడు మ‌హాన‌టి దీనికి త‌గ్గ రేంజ్ లో కుమ్మేస్తుంది. ఈ చిత్రం 23 రోజుల్లో 38 కోట్ల షేర్ వ‌సూలు చేసింది. తొలి వారంలో 19 కోట్లు రాబ‌ట్టిన మ‌హాన‌టి.. రెండోవారంలో మ‌రో 10 కోట్లు తీసుకొచ్చింది.. ఇక మూడో వారంలో 4 కోట్లు జ‌మ‌చేసి లెక్క 33 కోట్ల‌కు చేరింది. ఇక ఇప్పుడు మ‌రో 5 కోట్లు రాబ‌ట్టి ఇప్ప‌టి వ‌ర‌కు 38 కోట్లు వ‌సూలు చేసింది ఈ చిత్రం.

నైజాంలో.. ఓవ‌ర్సీస్ లో 10 కోట్ల షేర్ అందుకుంది ఈ చిత్రం. నాగ్ అశ్విన్ తెర‌కెక్కించిన ఈ చిత్రాన్ని స్వప్న సినిమా సంస్థ నిర్మించింది. కీర్తిసురేష్ న‌ట‌న చ‌రిత్ర‌లో నిలిచిపోయింది. ఇదిలా ఉంటే నాలుగో వారంలోనూ అభిమ‌న్యుడు.. ఆఫీస‌ర్.. రాజుగాడు విడుద‌లైనా ఇప్ప‌టికీ వ‌సూళ్లు కుమ్మేస్తుంది ఈ చిత్రం. అభిమ‌న్యుడు మాత్ర‌మే కాస్త ప్ర‌భావం చూపిస్తుండ‌టం మ‌హాన‌టికి క‌లిసొస్తుంది. మ‌హాన‌టి వ‌చ్చిన త‌ర్వాతే నా పేరు సూర్య‌.. నేల‌టికెట్.. అమ్మ‌మ్మ‌గారిల్లు.. ఆఫీస‌ర్.. రాజుగాడు లాంటి సినిమాల‌న్నీ ఈ చిత్రం దెబ్బ‌కు ప‌డుకున్నాయి. చూడాలిక‌.. సావిత్ర‌మ్మ దూకుడు ఇంకా ఎన్ని రోజులు సాగ‌నుందో..?

User Comments