`మ‌హానాయ‌కుడు` ముగింపు క‌లెక్ష‌న్స్‌

ఎన్టీఆర్ బ‌యోపిక్ సంద‌డి ఇక ముగిసిన‌ట్టే. తొలిగా ఈ సిరీస్ లో `క‌థానాయ‌కుడు` వ‌చ్చి వెళ్లింది. తొలి భాగం డిజాస్ట‌ర్ రిజ‌ల్ట్ తార‌క‌రామారావు అభిమానుల్ని తీవ్రంగానే నిరాస ప‌రిచింది. క‌నీసం మ‌హానాయ‌కుడు అయినా ఆ లోటును పూడుస్తుందా? అంటూ రిలీజ్ ముందు నంద‌మూరి అభిమానులు మాట్లాడుకున్నారు. అయితే రిలీజ్ అనంత‌రం ఈ సినిమాపైనా క్రిటిక్స్ పెద‌వి విరిచేసారు. సినిమాలు బావున్నా క‌లెక్ష‌న్లు క‌ష్ట‌మేన‌ని విశ్లేషించారు. అన్నంత ప‌నీ అయ్యింది. ఎన్టీఆర్ రాజకీయ జీవితాన్ని పెద్ద తెర‌పై వీక్షించాల‌న్న ఆస‌క్తి ఆడియెన్ లో లేక‌పోవ‌డ‌మో లేదా క‌థానాయ‌కుడు ఫ్లాప్ ప్ర‌భావ‌మో కానీ జ‌నం థియేట‌ర్ల వైపు క‌దిలిన వైనం క‌నిపించ‌లేదు. ప‌ర్య‌వ‌సానంగా మ‌హానాయ‌కుడు కేవ‌లం 4.34కోట్ల వ‌సూళ్ల‌తో స‌రిపెట్టుకోవాల్సి వ‌చ్చింద‌ని ట్రేడ్ చెబుతోంది.

తాజాగా ట్రేడ్ రిపోర్ట్ ప్ర‌కారం.. మ‌హానాయ‌కుడు వ‌ర‌ల్డ్ వైడ్ ఫైన‌ల్ షేర్ వివ‌రాలివి. నైజాం- 0.87 కోట్లు, సీడెడ్‌- Rs 0.51 కోట్లు, తూ.గో జిల్లా -0.22 కోట్లు, ప‌.గో.జిల్లా – 0.19 కోట్లు, అమెరికా- 31 ల‌క్ష‌లు, గుంటూరు- 0.71 కోట్లు, కృష్ణ‌- 29ల‌క్ష‌లు, నెల్లూరు -14ల‌క్ష‌లు, ఇత‌ర ఇండియా- 40ల‌క్ష‌లు, ఓవ‌ర్సీస్ -70ల‌క్ష‌లు, ఓవరాల్ గా 4.34 కోట్ల షేర్ వ‌సూలైంది. అంటే మ‌హానాయ‌కుడు చిత్రం డిజాస్ట‌ర్ రిజ‌ల్ట్ అందుకుంద‌ని ట్రేడ్ డిక్లేర్ చేసింది.

Also Read : Ntr Mahanayakudu Closing Collections