`మ‌హానాయ‌కుడు` ఫ్రీగానే..

ఎన్టీఆర్ బ‌యోపిక్ తొలి భాగం క‌థానాయ‌కుడు డిజాస్ట‌ర్ రిజ‌ల్ట్ అందుకున్న సంగ‌తి తెలిసిందే. సంక్రాంతి సినిమాల్లో భారీ న‌ష్టాలు తెచ్చింద‌న్న టాక్ వినిపిస్తోంది. ఆ క్ర‌మంలోనే రెండో భాగం మ‌హానాయ‌కుడు రిలీజ్ పై సందిగ్ధ‌త నెల‌కొంది. ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రిలో రిలీజ్ కి రెడీ అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఆ క్ర‌మంలోనే క‌థానాయ‌కుడు న‌ష్టాల్ని పూడ్చేందుకు చిత్ర క‌థానాయ‌కుడు, నిర్మాత బాల‌కృష్ణ డేరింగ్ డెసిష‌న్ తీసుకున్నార‌ని తెలుస్తోంది.

బ‌యోపిక్ పార్ట్ 2 (మ‌హానాయ‌కుడు)ను కొనేందుకు ఎలానూ డిస్ట్రిబ్యూట‌ర్లు ముందుకు రారు కాబ‌ట్టి.. న‌ష్టాల‌కు బాధ్య‌త‌గా క‌థానాయ‌కుడు చిత్రాన్ని ఉచితంగానే డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు ఇస్తున్నార‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. ఇక క‌థానాయ‌కుడు ప‌రాభ‌వానికి కార‌ణాలేంటో కూడా విశ్లేషిస్త‌న్నార‌ట‌. ఈ సినిమాని తొలిగా ప్రారంభించాల‌ని సంక‌ల్పించిన సాయి కొర్ర‌పాటి, విష్ణు ఇందూరి వంటి వారిని ప‌క్క‌న పెట్టి బాల‌కృష్ణ తానే నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించ‌డం ఓ పెద్ద మైన‌స్ అయ్యింది. ఇక మ‌హానటి బూచీతో భారీ హైప్ పెంచి, పంపిణీదారుల‌కు అమ్మేయ‌డం వ‌ల్ల కూడా స‌మ‌స్య త‌ప్ప‌లేదు. అలాగే ఈ బ‌యోపిక్ ని రెండు భాగాలుగా తీయాల‌నుకోవ‌డం, ఎన్టీఆర్ జీవితంలో వాస్త‌వాలు చూప‌కుండా ఫిక్ష‌నైజ్ చేయ‌డం పైనా ఇప్ప‌టికే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఫెయిలైంది కాబ‌ట్టి విమ‌ర్శ‌లొస్తున్నాయి! అని కొట్టి పారేయ‌కుండా ఎన్‌బీకే ఫిలింస్ అధినేత బాల‌కృష్ణ ఈ ఫెయిల్యూర్ పై నిజాయితీగా విశ్లేషించుకుంటున్నారా? అంటూ ప్ర‌శ్నలు ఎదుర‌వుతున్నాయి. మ‌రి వీటికి ఎన్‌బీకే స‌మాధాన‌మేంటో?