మ‌హానాయ‌కుడినే టీజ్ చేస్తాడా?

ఎన్టీఆర్ – క‌థానాయ‌కుడు చిత్రానికి పోటీగా రిలీజ్ చేసేందుకు `యాత్ర‌` చిత్రాన్ని సిద్ధం చేయాల‌నుకున్నామ‌ని ఇటీవ‌లే మ‌హి.వి.రాఘ‌వ్ ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. బ‌యోపిక్ వార్ ను షురూ చేసేందుకు ప్ర‌య‌త్నించినా థియేట‌ర్ల స‌మ‌స్య‌తో కుద‌ర‌లేదు. ఇప్పుడు యాత్ర చిత్రాన్ని `మ‌హానాయ‌కుడు`కు పోటీగా దించుతున్న సంగ‌తి తెలిసిందే. ఆ రెండు చిత్రాలు ఒక రోజు గ్యాప్ తోనే రిలీజ‌వుతాయ‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. ఫిబ్ర‌వ‌రి 8న యాత్ర రిలీజ‌వుతోంది. దానికి కాస్త అటూ ఇటూగా `మ‌హానాయ‌కుడు` చిత్రాన్ని బాల‌కృష్ణ‌- క్రిష్ బృందం రిలీజ్ చేయ‌నుంది.
ఇప్ప‌టికే క‌థానాయ‌కుడు ప‌రాభ‌వ భారంతో ఉన్న ఎన్‌బీకే `మ‌హానాయుకుడు`ను రిలీజ్ చేసే విష‌య‌మై ఎంతో సందిగ్ధ‌త‌తో ఉన్నార‌ట‌. ఆ క్ర‌మంలోనే `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్` చిత్రాన్ని `మ‌హానాయ‌కుడు`కు పోటీగా దించేందుకు వ‌ర్మ ఏర్పాట్లు చేస్తున్నాడు. పైగా లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ థియట్రికల్‌ ట్రైలర్‌ ఎప్పుడు రిలీజ్ చేయబోయేది `యన్‌.టి.ఆర్‌ మహానాయకుడు` రిలీజ్ తేదీ ప్ర‌క‌ట‌న‌పై ఆధారపడి ఉందని త‌న‌దైన శైలిలో వ‌ర్మ టీజ్ చేయ‌డంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. “మహానాయకుడు రిలీజ్ డేట్ ప్రకటించినప్పుడే ట్రైలర్‌ రిలీజ్ చేయాల్సిందిగా స్వర్గం నుంచి ఎన్టీఆర్‌ నాకు సందేశం ఇచ్చారు“ అంటూ త‌న‌దైన శైలిలో ఆర్జీవీ ఎక్స్ టార్ష‌న్ స్టార్ట్ చేయ‌డంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. బ‌యోపిక్ వార్ లో ఈ టీజింగ్ గేమ్ బోలెడంత వినోదాన్ని పంచుతోంది. మునుముందు త‌న సినిమా రిలీజ్ వేళ పోటీదారుల్ని ఇంకెలాంటి ఎక్స్ టార్ష‌న్(ఇదోర‌కం వేధింపు) కి గురి చేస్తాడో ఆర్జీవీ?