మ‌హానాయ‌కుడు డైలెమా క్లియ‌ర్

Last Updated on by

సంక్రాంతి చిత్రాల్లో `ఎన్టీఆర్ – క‌థానాయ‌కుడు` ఊహించ‌ని ఫ‌లితం అందుకుని అంద‌రికీ షాకిచ్చిన సంగ‌తి తెలిసిందే. స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క రామారావు జీవిత కథ‌ని తెర‌కెక్కిస్తూ బాల‌కృష్ణ చేసిన ప్ర‌య‌త్నానికి పేరొచ్చినా.. బాక్సాఫీస్ ఫ‌లితం మాత్రం నిశ్చేష్టుల్ని చేసింది. `మ‌ణిక‌ర్ణిక‌`ను కాద‌ని క్రిష్ ఈ సినిమా కోసం రావ‌డంతో జాతీయ మీడియా సైతం ఈ సినిమాపై అస‌క్తిని చూపించింది. ఆ అంచ‌నాల స్థాయిలో `ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు` ఏ మాత్రం లేక‌పోవ‌డం, క‌లెక్ష‌న్‌లు కూడా ఆశించినంత‌గా రాక‌పోవ‌డంతో  దారుణ వైఫ‌ల్యాన్ని చ‌విచూసింది. జూనియ‌ర్ ఎన్టీఆర్ చేయాల్సిన సినిమాను బాల‌కృష్ణ చేయ‌డం జ‌నాల‌కు బొత్తిగా న‌చ్చ‌లేదు. అదే క‌థానాయ‌కుడు బాక్సాఫీస్ వ‌ద్ద  దారుణంగా ఫ్లాప్ కావ‌డానికి ప్ర‌ధాన కార‌ణంగా నిలిచింది.
పైగా ఇటీవ‌ల బాల‌య్య త‌న పాపులారిటీకి త‌నే మంగ‌ళం పాడుకోవ‌డం కూడా ఈ సినిమా ఫ‌లితానికి మ‌రో కార‌ణంగా నిలిచింద‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. 70.58 కోట్ల‌కు బిజినెస్ చేసుకున్న ఈ చిత్ర నిర్మాత‌ల‌కు 20 కోట్ల‌లోపు మాత్ర‌మే వ‌సూళ్లు సాధించిన ఈ సినిమా భారీ షాక్ ఇచ్చింది. దీంతో ఈ చిత్రానికి కొన‌సాగింపుగా విడుద‌ల కానున్న `ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు` చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 7న విడుద‌ల చేయాల‌ని చిత్ర బృందం ప్లాన్ చేసింది. అయితే `ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు` ఫ‌లితంతో కంగుతిన్న చిత్ర వ‌ర్గాలు వెన‌క్కు త‌గ్గి వారం ఆల‌స్యంగా అంటే ఫిబ్ర‌వ‌రి 14న విడుద చేయాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ట‌. రెండ భాగంపై వున్న న‌మ్మ‌కంతో ఫిబ్ర‌వరి 14న రిలీజ్ చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నార‌ని తెలిసింది. అయితే తొలి భాగం తెచ్చిన న‌ష్టాల‌ను దృష్టిలో పెట్టుకుని రెండ‌వ భాగాన్ని అమ్మాల్సి వుంటుంది కాబ‌ట్టి మ‌హానాయ‌కుడుకు బ‌య్య‌ర్లు భారీ మొత్తాన్ని చెల్లించే అవ‌కాశం లేదు. వాళ్లు అడిగినంత‌కు అటు ఇటుగా అమ్మాలి లేదంటే అనుకున్న స‌మ‌యానికి విడుద‌ల కావడం క‌ష్ట‌మే.

Related Posts