మ‌హ‌ర్షి బ్యూటీ పూజా యోగా విన్యాసాలు

ముంబై టు హైద‌రాబాద్ పూజాహెగ్డే జ‌ర్నీ గురించి తెలిసిందే. వ‌రుస‌గా స్టార్ హీరోల స‌ర‌స‌న క‌థానాయిక‌గా న‌టిస్తోంది. అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ రెండుచోట్లా పూజా కెరీర్ జెట్ స్పీడ్ తోనే ఉంది. ఇప్ప‌టికిప్పుడు టాలీవుడ్ లో రెండు భారీ చిత్రాల్లో న‌టిస్తూ హాట్ టాపిక్ గా మారింది. మ‌హేష్ స‌ర‌స‌న `మ‌హ‌ర్షి` చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఈ సినిమా స‌మ్మ‌ర్ కానుక‌గా రిలీజ్ కానుంది. అలాగే ప్ర‌భాస్ స‌ర‌స‌న జాన్ అనే చిత్రంలోనూ పూజా ఆడిపాడుతోంది. ఆ సినిమా 2019లో రిలీజ్ కానుంద‌ని తెలుస్తోంది. వీటితో పాటు బాలీవుడ్ లో `హౌస్ ఫుల్ 4 ` చిత్రంలో పూజా హెగ్డే న‌టిస్తోంది.

ఒకేసారి మూడు సినిమాల్లో న‌టిస్తోంది కాబ‌ట్టి అందుకు త‌గ్గ‌ట్టే ఇట్నుంచి అటు, అట్నుంచి ఇటు ఈ భామ ప‌రుగులు పెడుతోందిట‌. ఓవైపు హైద‌రాబాద్ స‌హా విదేశాల్లో షూటింగులు చేస్తూనే, మ‌రోవైపు ముంబైకి వెళుతోంది. అక్క‌డ భారీ మ‌ల్టీస్టార‌ర్ లో న‌టిస్తూ బిజీగా ఉంది. ఇన్ని చేస్తున్నా ఫిట్ నెస్ ప‌రంగా పూజా ఏమాత్రం త‌గ్గ‌డం లేదు. రెగ్యుల‌ర్ గా జిమ్ కి వెళుతూ.. ఫిట్ నెస్ ని కాపాడుకోవ‌డంలో అంతే శ్ర‌ద్ధ క‌నిపిస్తోంది. తాజాగా పూజా హెగ్డే యోగా చేస్తున్న ఓ వీడియోని సామాజిక మాధ్య‌మాల్లో షేర్ చేసింది. ఒక గోడ ఆస‌రాగా త‌ల‌కిందులుగా శీర్షాస‌నం వేస్తూ వేడి పెంచింది. ఈ వీడియో ప్ర‌స్తుతం యువ‌త‌రంలో జోరుగా వైర‌ల్ అవుతోంది. ఇంత‌గా శ్ర‌ద్ధ తీసుకుంటుంది కాబ‌ట్టే పూజా అంత వేడెక్కించే రూపలావ‌ణ్యం మెయింటెయిన్ చేయ‌గ‌లుగుతోంద‌న్న‌మాట‌!