మ‌హ‌ర్షి బాక్సాఫీస్ రిపోర్ట్ ఇదే

Last Updated on by

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు క‌థానాయ‌కుడిగా న‌టించిన `మ‌హ‌ర్షి`కి అస‌లైన ప‌రీక్ష ఈరోజు నుంచే మొద‌లైంది. మ‌హేష్ సిస‌లైన బాక్సాఫీస్ ద‌మ్ముకు నేటి నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఈరోజు నుంచి వ‌చ్చే వ‌సూళ్ల లెక్క‌తో మ‌హ‌ర్షి లో మ్యాట‌ర్ ఉందా? లేదా? అన్న‌ది తేలిపోనుంది. ఇదంతా కేవ‌లం బ‌డ్జెట్ ఎక్కుడ‌గా పెట్ట‌డం.. ఒక్క తెలుగు రాష్ర్టాల్లోనే 72 కోట్ల‌కు బిజినెస్ జ‌ర‌గ‌డం వ‌ల్ల వ‌చ్చిన తంటా అని చెప్పాల్సిన ప‌నిలేదు.

ఈ ఐదు రోజుల వ‌సూళ్ల వివ‌రాలు ఇలా ఉన్నాయి. నైజాం 16.61 కోట్లు, ఈస్ట్ గోదావ‌రి 4.86 కోట్లు, వెస్ట్ గోదావ‌రి 5.70 కోట్లు, అమెరికా 5.55 కోట్లు, కృష్ణా 3.62 కోట్లు, గుంటూరు 5.90 కోట్లు, నెల్లూరు 1.75 కోట్లు, సీడెడ్ 5.60 కోట్లు ఏపీ, తెలంగాణ క‌లిపితే 47.58 కోట్లు. సినిమాకు మిక్స్డు టాక్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. కానీ మహేష్ కాల‌రెగ‌రేసి మ‌రీ నిన్న‌టి రోజున త‌న పాత సినిమా రికార్డుల‌న్నింటిని తిరగ రాస్తుంద‌ని….బాక్సాఫీస్ వ‌ద్ద స‌రికొత్త రికార్డులు షురే చేయ‌డం ఖాయ‌మంటూ ధీమా వ్య‌క్తం చేసారు. మ‌రి మ‌హేష్ ఎక్స్ పక్టేష‌న్స్ ను మ‌హ‌ర్షి రీచ్ అవుతాడో? లేదో? చూద్దాం.