మహ‌ర్షి తెచ్చిన మార్పు..ప‌ల్లెకి మ‌హేష్

Last Updated on by

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబులో `మ‌హ‌ర్షి` కొన్ని మార్పులు తీసుకొచ్చింది. శ్రీమంతుడు స‌క్సెస్ అయిన సంద‌ర్భంగా ప‌ల్లెటూళ్ల‌ను ద‌త్త‌త తీసుకున్న మ‌హేష్ ఇప్పుడు నేరుగా ప‌ల్లెటూరికే వ‌స్తానంటున్నాడు. క‌నీసం ఏడాదికి ఒక్క‌సారైనా మ‌ట్టి వాస‌న చూడాలి..ఆ ప‌ల్లెటూరి వాతావ‌ర‌ణంను ఆస్వాదించాలంటూ కొద్ది సేప‌టి క్రిత‌మే వెల్ల‌డించాడు. రెండేళ్ల కిత్రం మ‌హేష్ వేరు…ఇప్పుడు చూస్తున్న మ‌హేష్ వేరు. త‌న సినిమాల‌కు చాలా విష‌యాలు నేర్పాయంటున్నాడు. నా మూల‌ల‌తో క‌నెక్ట్ అవ్వ‌డానికి మ‌హ‌ర్షి ఎంతో తోడ్ప‌డింది.

అందుకే ఈ సినిమా నా కెరీర్ లోనే బెస్ట్ అని చెబుతున్నా అన్నాడు. ప్ర‌తీ ఏడాది మ‌హేష్ ఏడాదిలో నాలుగైదు సార్లు విదేశాలు టూర్లు వెళ్తుంటారు. ఇప్పుడా ట్రిప్ లో ఓ టూర్ ను ప‌ల్లెటూరు వైపు ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంద‌న్న మాట‌. ఇది నిజంగా మ‌హేష్ అభిమానుల‌కు గుడ్ న్యూస్. మ‌హేష్ ను చూడ‌టానికి నిత్యం ఎంతో మంది అభిమానులు హైద‌రాబాద్ వ‌స్తుంటారు. ఆయ‌న ఇంటి ఇద్ద‌…షూటింగ్ స్పాట్ వ‌ద్ద ప‌డిగాపులు ప‌డుతుంటారు. స్పాట్ లో వెసులు బాటు ఉంటే విసుకోక్కుండా మ‌హేష్ ప్ర‌త్యేకంగా ఫోటోలిస్తుంటాడు. ఇప్పుడు ప‌ల్లెకి ప‌య‌నం అవుతున్నాడు కాబ‌ట్టి అభిమానుల‌కు ఆ ఇక్క‌ట్లు కొంచెం తీరున‌ట్లే.