మ‌హ‌ర్షి డిజిట‌ల్ రేటెంత‌?

Last Updated on by

డిజిట‌ల్ రంగంలోకి అమెజాన్, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్ వంటి దిగ్గ‌జాల రాక‌తో సినిమా రూపురేఖ‌లే మారిపోయింది. రిలీజ్ సినిమాని కేవ‌లం నెలరోజుల గ్యాప్ తోనే ఆన్ లైన్ లో అందుబాటులోకి తెచ్చేస్తున్నారు వీళ్లంతా. ఆన్ లైన్ వీక్ష‌ణ అంత‌కంత‌కు పెరుగుతుండ‌డంతో అమెజాన్ లాంటి సంస్థ‌లు పోటీప‌డి మ‌రీ స్టార్ల సినిమాల డిజిట‌ల్ రైట్స్ ని ఎగ‌రేసుకుపోతున్నాయి.

టాలీవుడ్ అగ్ర హీరోల సినిమాల‌న్నీ ఇంచుమించుగా అమెజాన్ చేజిక్కించుకుంటోంది. సౌత్ లో పెద్ద హీరోల సినిమాలేవీ అమెజాన్ విడిచిపెట్ట‌డం లేదు. ఇక అమెజాన్ తో పోటీప‌డ‌లేక ఇత‌ర సంస్థ‌లు చేతులు ముడిచేస్తున్నాయి. తాజాగా మ‌రోసారి అమెజాన్ హ‌వా క‌నిపిస్తోంది. లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం ఈ సీజ‌న్ లో క్రేజీ మూవీగా రిలీజ‌వుతున్న మ‌హేష్ మ‌హ‌ర్షి డిజిట‌ల్ రైట్స్ ని అమెజాన్ ఛేజిక్కించుకుంద‌ని తెలుస్తోంది. దాదాపు 11కోట్ల‌కు మ‌హ‌ర్షి డిజిట‌ల్ రైట్స్ ని అమ్మేశార‌ని వార్త‌లొస్తున్నాయి. మ‌హేష్ గ‌త చిత్రాల్ని అమెజాన్ కొనుక్కుంది. అలాగే టాలీవుడ్ అగ్ర హీరోల సినిమాల్ని అమెజాన్ చేజిక్కించుకుని లైవ్ చేసిన సంగ‌తి తెలిసిందే. మ‌హ‌ర్షి చిత్రం మే 9న ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ‌వుతోంది. అంటే… జూన్ 9 నాటికి ఈ చిత్రం డిజిట‌ల్ లో అభిమానుల‌కు అందుబాటులోకి వ‌చ్చేస్తుంద‌న్న‌మాట‌.

User Comments