మ‌హ‌ర్షిని మెచ్చిన ఉప‌రాష్ట్ర‌ప‌తి

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు క‌థానాయ‌కుడిగా న‌టించిన మ‌హ‌ర్షి ఇటీవ‌ల విడుద‌లై మంచి టాక్ ద‌క్కించుకున్న సంగ‌తి తెలిసిందే. అభిమానులు, సెల‌బ్రిటీలు మ‌హ‌ర్షిపై త‌మ అభిప్రాయాల‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకున్నాడు. శ్రీమంతుడు రిలీజ్ స‌మ‌యంలో ఎలాంటి రెస్పాన్స్ వ‌చ్చిందో మ‌హ‌ర్షి రిలీజ్ కు అదే రిపీట్ అయింది. తాజాగా ఉప‌రాష్ర్ట ప‌తి వెంక‌య్య నాయుడు మ‌హ‌ర్షి సినిమాపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు.

కుటుంబ సభ్యులతో ‘మహర్షి’ చూసా. గ్రామీణ ఇతివృత్త.. వ్యవసాయ పరిరక్షణ.. అన్నదాతలకు అండగా నిలబడాల్సిన ఆవశ్యకతను సినిమాలో చాలా గొప్ప‌గా చెప్పారు. మంచి సందేశాత్మ‌క చిత్ర‌మిది. ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా. గ్రామీణ ప్రజల సౌభాగ్యాన్ని, వ్యవసాయ ప్రాధాన్యతను ‘మహర్షి’ గుర్తు చేసాడు. మ‌హేష్ బాబు న‌ట‌న చాలా స‌హ‌జంగా ఉంది. ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి తెర‌కెక్కించిన విధానం బాగుంది. నిర్మాతలతో పాటు చిత్ర బృందానికి అభినందనలు తెలియజేస్తున్నాను` అని ట్వీట్ చేసారు. గ‌తంలో శ్రీమంతుడు సినిమా చూసిన‌ప్పుడు వెంక‌య్య నాయుడు ఇలాగే స్పందించారు. అందులో మ‌హేష్ గ్రామాల‌ను ద‌త్త‌త్త తీసుకున్న స‌న్నివేశం గురించి ప్ర‌త్యేకంగా మాట్లాడ‌టం జ‌రిగింది. ఇంకా ఇత‌ర స్టార్ హీరోల సినిమాలు చాలా వ‌స్తున్నాయి. అయితే సోష‌ల్ కాజ్ తో చేస్తోన్న‌ మ‌హేష్ సినిమాల‌ను వెంక‌య్య నాయుడు మెచ్చుకోవ‌డం విశేషం.