మ‌హ‌ర్షి మూవీ రివ్యూ

Maharshi Movie review

నటీనటులు : మ‌హేష్‌, పూజా హెగ్డే, అల్ల‌రి న‌రేష్, రావు ర‌మేష్ త‌దిత‌రులు
బ్యానర్: శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్- పీవీపీ సినిమా- వైజ‌యంతి మూవీస్
నిర్మాత: దిల్ రాజు- పీవీపీ- అశ్వ‌నిద‌త్
సంగీతం: దేవీశ్రీ ప్ర‌సాద్
దర్శకత్వం: వ‌ంశీ పైడిప‌ల్లి

ముందు మాట:

సూప‌ర్ స్టార్ మ‌హేష్ హీరోగా వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన `మ‌హ‌ర్షి` ఈ గురువారం ప్ర‌పంచ‌వ్యాప్తంగా అత్యంత క్రేజీగా రిలీజైంది. మ‌హేష్ ఈ చిత్రంలో మూడుర‌కాల షేడ్స్ లో న‌టించారు. కాలేజ్ విద్యార్థిగా .. కార్పొరెట్ సీఈవోగా.. రైతుగా డిఫ‌రెంట్ గెట‌ప్పుల‌తో తెర‌పై క‌నిపించారు. పోస్ట‌ర్లు.. టీజ‌ర్.. ట్రైల‌ర్ చూశాక‌.. మ‌హేష్‌- పూజా హెగ్డే- అల్ల‌రి న‌రేష్ కాలేజ్ స్నేహానికి సంబంధించిన చిత్ర‌మిద‌ని ముందే అర్థ‌మైంది. ఇక ఆ ముగ్గురి జీవిత గ‌మ్యం ఏంటి? అందులో మ‌హ‌ర్షి ఎంచుకున్న మార్గం ఏంటి? అత‌డు ఆ మార్గాన్ని ఎందుకు ఎంచుకోవాల్సొచ్చింది? అల్ల‌రి న‌రేష్ క‌థ‌లో ట్విస్టేంటి? మ‌హేష్ కి ఎదురొచ్చే క్రూర‌మైన విల‌న్ ఎవ‌రు? అన్న‌ది తెర‌పైనే చూడాలి. ఈ సినిమా మ‌హేష్ కెరీర్ బెస్ట్ గా నిలుస్తుంద‌ని.. నాన్ బాహుబ‌లి కేట‌గిరీలో రికార్డుల్ని బ్రేక్ చేస్తుంద‌ని దిల్ రాజు మీడియా స‌మావేశాల్లో న‌మ్మ‌కం వ్య‌క్తం చేశారు. దీంతో అభిమానుల్లోనూ ఎంతో క్యూరియాసిటీ పెరిగింది. ఎంతో హైప్ న‌డుమ ప్రీబుకింగ్స్ హోరెత్తిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ సినిమా హైప్ కి త‌గ్గ‌ట్టు అంద‌రి అంచ‌నాల్ని రీచ్ అయ్యిందా లేదా? అన్న‌ది తెలియాలంటే ఈ రివ్యూ చ‌ద‌వాల్సిందే.

కథనం అనాలిసిస్:

రిషి(మ‌హేష్‌) జీవిత‌ప‌య‌నం .. అత‌డు తాను ఎంచుకున్న మార్గంలో `మ‌హ‌ర్షి`గా ఎదిగిన వైనం ఈ సినిమా థీమ్. ఒక కాలేజ్ కుర్రాడు తాను అనుకున్న‌ది సాధించుకుని కార్పొరెట్ కంపెనీ సీఈవోగా ఎదిగాక తిరిగి వెన‌క్కి చూస్తే లైఫ్ లో సాధించాల్సిన అస‌లు ల‌క్ష్యం క‌నిపిస్తుంది. అటుపై త‌న చిన్న‌నాటి స్నేహితుడి(అల్ల‌రి న‌రేష్‌) గ్రామానికి వెళ్లిన రిషీకి అక్క‌డ ఎదురైన స‌మ‌స్య‌లేంటి? వాటిని ఎలా ప‌రిష్క‌రించాడు? అన్న‌దే సినిమా. ఈ క‌థ‌లో పూజా(పూజా హెగ్డే)తో ప్రేమ‌క‌థ …తండ్రి(ప్ర‌కాష్‌రాజ్‌)తో సంఘ‌ర్ష‌ణ‌.. జ‌గ‌ప‌తిబాబు భూదందా .. స్నేహితుడు అల్ల‌రి న‌రేష్ త్యాగం.. ఇవ‌న్నీ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్.

క‌థాంశంలోకి వెళితే.. ప్ర‌కాష్ రాజ్ – జ‌య‌సుధల కుమారుడు రిషి (మ‌హేష్‌) ఓ కాలేజ్ విద్యార్థి. మీనాక్షి ధీక్షిత్.. వెన్నెల కిషోర్ అత‌డి క్లాస్ మేట్స్. రిషీ తొలి నుంచి నాన్న‌ ప్ర‌కాష్ రాజ్ ఐడియాల‌జీతో విభేధిస్తూ.. లైఫ్ లో ఎదిగేందుకు ప్ర‌య‌త్నిస్తాడు. రిషి తండ్రితో మాట్లాడేందుకు ఇష్ట‌ప‌డ‌డు. ఆ క్ర‌మంలోనే వైజాగ్ వెళ్లి అక్క‌డ ఐఐఈటీ-కాలేజ్ లో చేర‌తాడు. అస‌లు క‌థ ఇక్క‌డే మొద‌ల‌వుతుంది. పూజా హెగ్డే.. అల్ల‌రి న‌రేష్ అత‌డి జీవితంలోకి ప్ర‌వేశిస్తారు. ఆ ముగ్గురి మ‌ధ్యా ఆహ్లాద‌క‌ర‌మైన స్నేహానుబంధం .. మెమ‌రీస్.. ఇలా జీవితం సాగుతుండ‌గానే.. కాలేజ్ గొడ‌వ‌లు .. విల‌న్ ముఖేష్ రిషీ ఎంట్రీ ఉత్కంఠ‌ పెంచుతాయి. ఈ జ‌ర్నీలోనే పూజా రిషీతో ప్రేమ‌లో ప‌డ‌డ‌డం.. అత‌డు త‌న జీవిత ల‌క్ష్యం కోసం ప్రేమ‌ను రిజెక్ట్ చేయ‌డం చ‌క‌చ‌కా జీవిత‌గ‌మ‌నంలో వ‌రుస ట్విస్టులు బ‌య‌ట‌ప‌డ‌తాయి. రిషీ అమెరికా వెళ్లి స్ట‌డీస్ కొన‌సాగిస్తుండ‌గా.. తండ్రి ప్ర‌కాష్ రాజ్ మ‌ర‌ణిస్తాడు. అది రిషీ లైఫ్ లో ఓ పెద్ద సెట్ బ్యాక్ అనుకుంటుండ‌గా అంత‌కుమించి త‌న స్నేహితుడు అల్ల‌రి న‌రేష్ చేసిన ఓ త్యాగం అత‌డిని తిరిగి ఇండియాకి ర‌ప్పిస్తుంది. స్వ‌దేశానికి వ‌చ్చాక రిషీ అస‌లు మిష‌న్ మొద‌ల‌వుతుంది. తూ.గో జిల్లాలో న‌రేష్ గ్రామానికి వెళ్లాక రిషీకి ఎదురైన రైతు స‌మ‌స్య‌లేంటి? వాటి ప‌రిష్కారానికి ఏం చేశాడు? అన్న‌దే బ్యాలెన్స్ సినిమా. ఊరి రైతులు కార్పొరెట్ దందాతో భూమిని వ‌దులుకోవాల్సిన స‌న్నివేశంలో రిషీ ఆ కార్పొరెట్ కి ఎదురెళ్లి చివ‌రికి ఆ ఊరిని విన్ అయ్యాడా లేదా? అన్న‌ది తెర‌పైనే చూడాలి.

ఈ మొత్తం క‌థ‌ని ఫ్లాష్ బ్యాక్స్ మోడ్ లో చూపించిన విధానం ఆస‌క్తి రేకెత్తిస్తుంది. రిషీని అమెరికాలో ఓ కంపెనీ సీఈవోగా ఆరంగేట్ర‌మే చూపించి .. అటుపై కాలేజ్ బ్యాక్ డ్రాప్ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లి.. తిరిగి పెద్ద స్థాయికి ఎదిగాక స్నేహితుడి గ్రామానికి ప‌య‌నించిన రిషీ అక్క‌డ ఏం చేశాడు? ఈ జ‌ర్నీని ఎంత ఇంట్రెస్టింగ్ గా మ‌లిచారు? అన్న‌ది ఆద్యంతం ర‌క్తి క‌ట్టిస్తుంది. ఈ క‌థ‌లో శ్రీ‌మంతుడి షేడ్స్ ఆస‌క్తిక‌రం. రావు ర‌మేష్.. పోసాని కృష్ణ‌ముర‌ళి.. నాజ‌ర్ (చేత‌కాని సీఎం) త‌దిత‌రులు స్థానిక‌ నాయ‌కులుగా ప‌రిచ‌యం అవుతారు.

నటీనటుల ప్ర‌ద‌ర్శ‌న‌:

మ‌హేష్ మ‌రోసారి త‌న కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ తో మెప్పించాడు. అల్ల‌రి న‌రేష్ కి చాలా కాలం త‌ర్వాత‌ గుడ్ కంబ్యాక్ మూవీ అనే చెప్పాలి. మ‌హేష్ – అల్ల‌రి న‌రేష్ మ‌ధ్య సింక్ .. కామెడీ స‌న్నివేశాలు అద్భుతంగా పండాయి. ఇక పూజా హెగ్డే పాత్ర పూర్తిగా స‌పోర్టింగ్ రోల్ అనే చెప్పాలి. త‌న అంద‌చందాలు.. అభిన‌యం ఆక‌ట్టుకుంటుంది. తండ్రిగా ప్ర‌కాష్ రాజ్ అభిన‌యం.. స్కూల్ టీచ‌ర్ గా రావు ర‌మేష్ న‌ట‌న‌..ఇంప్రెస్సివ్. ఇక క్రూరుడైన కార్పొరెట్ వాలాగా జ‌గ‌ప‌తిబాబు న‌ట‌న సినిమాకి మ‌రో ప్ర‌ధాన బ‌లం. క్లైమాక్స్ ముందు బ‌ల‌మైన సెంటిమెంట్ సీన్స్.. ప‌తాక స‌న్నివేశాల ఎలివేష‌న్ లో స్టార్ల న‌ట‌న మ‌రో హైలైట్.

టెక్నికాలిటీస్:

సాంకేతికంగా విజువ‌ల్ రిచ్ మూవీ ఇది. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ ఆక‌ట్టుకుంది. మోహ‌న‌న్ కెమెరా ప‌నిత‌నం.. దేవీ శ్రీ రీరికార్డింగ్ ఎఫెక్టివ్ నెస్ పెంచాయి. ఎంచుకున్న నేప‌థ్యానికి త‌గ్గ‌ట్టు రాజీ అన్న‌దే లేని పెట్టుబ‌డులు తెర‌పై విజువ‌ల్ రిచ్ లుక్ ని తెచ్చాయి. కొన్ని పాట‌లు.. ఫైట్స్ లో విజువ‌ల్ రిచ్ నెస్ ఆద్యంతం క‌ట్టి ప‌డేస్తుంది. అల్ల‌రి న‌రేష్ ని రిషీ సేవ్ చేసే ఫైట్ సీన్ సినిమాకే హైలైట్.

ప్లస్ పాయింట్స్:

* మ‌హేష్ .. అల్ల‌రి న‌రేష్ మ‌ధ్య‌ కామెడీ, ఎమోష‌న్‌ సీన్స్..
* ఎంచుకున్న కాలేజ్ బ్యాక్ డ్రాప్…
* రైతు నేప‌థ్యం.. క్లైమాక్స్
* విజువ‌ల్ గ్రాండియారిటీ

మైనస్ పాయింట్స్:

* స్లో న‌రేష‌న్ .. అక్క‌డ‌క్కడా సాగ‌తీత‌

ముగింపు:

మ‌హేష్ అభిమానుల‌కు బెస్ట్ స‌మ్మ‌ర్ ట్రీట్.. రిషీ జ‌ర్నీ ఇంప్రెస్సివ్

రేటింగ్: 3.25/5