`మ‌హర్షి` ఓవ‌ర్సీస్ ఇంకా డైల‌మాలోనే!

Last Updated on by

సూప‌ర్ స్టార్ మ‌హేష్ క‌థానాయ‌కుడిగా వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో దిల్ రాజు- అశ్వ‌నిదత్- పీవీపీ బృందం నిర్మిస్తున్న మ‌హ‌ర్షి చిత్రీక‌ర‌ణ మెజారిటీ పార్ట్ పూర్త‌యిన సంగ‌తి తెలిసిందే. ఏప్రిల్ లో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రాన్ని మే 9కి వాయిదా వేసిన సంగ‌తి తెలిసిందే. మ‌హ‌ర్షి చిత్రీక‌ర‌ణ పూర్త‌యినా నిర్మాణానంత‌ర ప‌నులు పూర్తి కాలేద‌ని, క్వాలిటీతో సినిమాని నిర్మిస్తున్నామ‌ని దిల్ రాజు ప్ర‌క‌టించారు.

ఇంత‌కీ ఈ సినిమా బిజినెస్ సంగ‌తేంటి? అంటే తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ ప‌రంగా హైప్ ఉన్నా ఓవ‌ర్సీస్ వ‌ర‌కూ డైలమా కొన‌సాగుతోంద‌ని తెలుస్తోంది. ఇటీవ‌లి కాలంలో మ‌హేష్ సినిమాలేవీ ఓవ‌ర్సీస్ పంపిణీదారుల‌కు లాభాలు తెచ్చి పెట్ట‌డం లేదట‌. నిర్మాత‌లు భారీ మొత్తాల్ని కోట్ చేస్తుండ‌డంతో సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అని టాక్ వ‌చ్చినా డిస్ట్రిబ్యూట‌ర్ కి మిగిలేదేమీ ఉండ‌డం లేదు. ఇటీవ‌లి కాలంలో ఒకే ఒక్క `శ్రీ‌మంతుడు` మిన‌హా ఇత‌ర సినిమ‌లేవీ ప్రాఫిట్స్ తేలేదు. దీంతో ఓవ‌ర్సీస్ పంపిణీదారులెవ‌రూ ఈ సినిమాని కొనేందుకు ముందుకు రావ‌డం లేద‌ని తెలిసింది.
కేవ‌లం ఓవ‌ర్సీస్ హ‌క్కుల కోసం దిల్ రాజు ఏకంగా 18 కోట్లు డిమాండ్ చేస్తున్నార‌ట‌. అయితే పంపిణీదారులు 12-13 కోట్ల వ‌ర‌కూ అయితే ఓకే చెబుతున్నార‌ట‌. దీంతో ఓవ‌ర్సీస్ హ‌క్కుల విష‌య‌మై డైలెమా కొన‌సాగుతోంది. నిర్మాత అడిగినంతా ఇచ్చేందుకు ఎవ‌రూ ముందుకు రాక‌పోవ‌డంతో సొంతంగానే రిలీజ్ చేసుకునే స‌న్నివేశం వ‌స్తుంద‌ని భావిస్తున్నారంతా. ప‌రిశ్ర‌మ‌లో ఓ ప్ర‌ముఖ పంపిణీదారుడు ఓవ‌ర్సీస్ హ‌క్కుల కోసం 12కోట్లు ఆఫ‌ర్ చేశాడ‌ట‌. వేరొక కొత్త వ్య‌క్తి 13కోట్ల వ‌ర‌కూ చెల్లించేందుకు సిద్ధ‌మ‌య్యార‌ట‌. అయితే దిల్ రాజు ఏమాత్రం త‌గ్గ‌డం లేదు. మ‌హ‌ర్షి హ‌క్కుల్ని తాను చెప్పిన ధ‌ర‌కు త‌గ్గేందుకు రెడీగా లేర‌ట‌. ఒక‌వేళ ఓవ‌ర్సీస్ డీల్ తేల‌ని ప‌క్షంలో నిర్మాతలు రిలీజ్ చేయాల‌న్న బ‌ర్డెన్ తో కూడుకున్న వ్య‌వ‌హార‌మేన‌ని చెబుతున్నారు. మొత్తానికి డైలెమా మాత్రం అలానే కొన‌సాగుతోంది.

User Comments