స‌ల్మాన్ తో `మ‌హర్షి` హిందీ రీమేక్?

Last Updated on by

సూప‌ర్ స్టార్ మ‌హేష్ న‌టించిన మ‌హ‌ర్షి నేడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సంగ‌తి తెలిసిందే. మ‌హేష్ కెరీర్ లో బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చారంటూ ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. మ‌రోవైపు సినిమాలో కంటెంట్ రొటీన్ గా ఉన్నా వంశీ పైడిప‌ల్లి తెర‌కెక్కించిన విధానం.. క్లైమాక్స్ లో సందేశం ఆద్యంతం ఆక‌ట్టుకున్నాయ‌న్న ప్ర‌చారం సాగుతోంది.
అయితే ఈ ప్ర‌చారం న‌డుమ ఈ సినిమాని హిందీలో రీమేక్ చేసేందుకు స‌ల్మాన్ ఖాన్ ఉత్సాహం చూపిస్తున్నార‌ని తెలుస్తోంది. నేడు ఆయ‌న ప్ర‌భుదేవాతో క‌లిసి మ‌హ‌ర్షి చిత్రాన్ని వీక్షించేందుకు ప్లాన్ చేశార‌ని చెబుతున్నారు. ఇప్ప‌టికే బాలీవుడ్ టై అప్ ల‌తో సినిమాలు తీసేందుకు దిల్ రాజు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ప్ర‌ముఖ నిర్మాత బోనీ క‌పూర్ తో క‌లిసి `ఎఫ్ 2` చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆ క్ర‌మంలోనే స‌ల్మాన్ భాయ్ తో మ‌హ‌ర్షి చిత్రాన్ని రీమేక్ చేసే ఆలోచ‌న‌ను ఇంప్లిమెంట్ చేశార‌న్న ముచ్చ‌టా వినిపిస్తోంది. ఇక మ‌హేష్ న‌టించిన పోకిరి రీమేక్ వాంటెడ్ లో స‌ల్మాన్ న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో భాయ్ సినిమా కోసం దిల్ రాజు వేరొక కంపెనీతో టై అప్ అయ్యి నిర్మించే వీలుంద‌ని అంతా భావిస్తున్నారు.

User Comments