మ‌హ‌ర్షి ర‌న్ టైమ్ ఎంతంటే?

ఇటీవ‌ల కాలంలో రిలీజ్ అవుతోన్న సినిమాల ర‌న్ టైమ్ అంత‌కంత‌కు పెరిగిపోతున్న సంగ‌తి తెలిసిందే. కంటెంట్ పై న‌మ్మ‌కంతో నిడివి ఎక్కువైనా ప‌ర్వాలేద‌ని హీరోలు డేర్ గా థియేట‌ర్లో కి వ‌చ్చేస్తున్నారు. నాలుగైదు గంట‌లొస్తున్న‌ సినిమాల‌ను కుదించ‌గా మూడుగంట‌ల‌కు కు అటు ఇటుగా ఎడిట్ చేసి వ‌దిలేస్తున్నారు. సినిమాలో అవి కీల‌క‌మైన స‌న్నివేశాలే అయిన‌ప్ప‌టికీ త‌ప్ప‌క క‌త్తెర వేయాల్సి వ‌స్తోంది. అటుపై ఆ డిలీటెడ్ స‌న్నివేశాల‌ను యూ ట్యూబ్ లో రిలీజ్ చేస్తున్నారు. సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు కు ఇలాంటి స‌మ‌స్య‌లు చాలాసార్లు ఎదుర‌య్యాయి. తాజాగా మ‌హ‌ర్షి సినిమాకు నిడివి స‌మ‌స్య త‌లెత్తిన‌ట్లు స‌మాచారం. సినిమా కంప్లీట్ ఎడిటెడ్ వెర్ష‌న్ చూడ‌గా మూడున్న‌ర గంట‌లొచ్చిందిట‌.

దీంతో లెంగ్త్ బాగా ఎక్కువ అవ్వ‌డంతో కుదించిన‌ట్లు స‌మాచారం. సినిమాలో ప్రారంభ‌మైన ప‌ది నిమిషాల త‌ర్వాత వ‌చ్చే కొన్ని స‌న్నివేశాల‌ను తొల‌గించి చివ‌రిగా `మ‌హ‌ర్షి`ని 2 గంట‌ల 55 నిమిషాల‌కు కుదించి లాక్ చేసారని చిత్ర బృందం నుంచి లీకైంది. ఇక సినిమాలో మ‌హర్షి పెర్పామెన్స్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదుట‌. మ‌హేష్ ఔట్ స్టాండింగ్ పెర్పామెన్స్ కు అవార్డులు..రివార్డులు ఖాయ‌మ‌ని యూనిట్ ధీమా వ్య‌క్తం చేస్తోంది. మ‌రి మహేష్ ఆ అంచ‌నాల‌ను అందుకుంటాడో? లేదో చూద్దాం. మే 9న సినిమా వ‌ర‌ల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. వంశీ పైడ‌ప‌ల్లి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.