టీజ‌ర్ ట్రీట్‌: `మ‌హర్షి` ఉగాది కానుక‌?

Last Updated on by

Last updated on March 26th, 2019 at 02:41 pm

సూప‌ర్ స్టార్ మ‌హేష్ న‌టిస్తున్న‌ `మ‌హ‌ర్షి` గురించి ఇప్ప‌టివ‌ర‌కూ తెలుగు ఆడియెన్ కి తెలిసింది త‌క్కువే. అధికారికంగా ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి కానీ, నిర్మాత దిల్ రాజు కానీ ఎలాంటి వివ‌రాలు చెప్ప‌లేదు. మ‌హేష్ బ్రిలియంట్ గా క‌నిపిస్తాడ‌ని, క‌థ అద్భుతంగా ఉంటుంద‌ని, ఫ్యామిలీ ఆడియెన్ ని మెప్పిస్తుంద‌ని రొటీన్ సంగ‌తులే చెప్పారు కానీ మ‌హేష్ ఫ‌లానా రోల్ లో క‌నిపిస్తున్నాడ‌ని మాత్రం రివీల్ చేయ‌లేదు. అయితే ఈ చిత్రంలో మ‌హేష్ విద్యార్థిగా క‌నిపిస్తాడ‌ని, రైతు పాత్ర‌లో ఎన్నారైగా ర‌క‌ర‌కాల షేడ్స్ ఉన్న పాత్ర‌ల్లో మెప్పిస్తాడ‌ని ప్ర‌చార‌మైంది.

ఇప్ప‌టికి రెండు మూడు స్టిల్స్ కూడా బ‌య‌ట‌కు రిలీజ్ కాలేదు. మ‌హేష్ విద్యార్థిగా ఉన్న‌ప్ప‌టి గెట‌ప్ త‌ప్ప వేరొక ఫోటోనే రాలేదు. ఇక లీక్డ్ పోటోలు కొన్ని అంత‌ర్జాలంలో హ‌ల్ చ‌ల్ చేశాయి. అయితే ఈ సినిమా రిలీజ్ కి ఇంకో నెల‌రోజుల స‌మ‌యం మాత్ర‌మే మిగిలి ఉంది. ఇంకా స‌రైన ప్ర‌మోష‌న‌ల్ మెటీరియ‌ల్ ఏదీ బ‌య‌ట‌కు రాలేదు. ఆ క్ర‌మంలోనే ఈ ఉగాదికి మ‌హ‌ర్షి సినిమాకి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్ ని లాంచ్ చేస్తార‌ని అభిమానులు అంచ‌నా వేస్తున్నారు. అందుకు సంబంధించి నిర్మాత‌ల నుంచి అధికారిక ప్ర‌క‌న‌ట‌న రావాల్సి ఉంది. ఏప్రిల్ 6న ఉగాది సంద‌ర్భంగా ఏదైనా కొత్త లుక్ రిలీజ్ చేస్తారా? అంటూ మ‌హేష్ అభిమానులు ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు- పీవీపీ- అశ్వ‌నిద‌త్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఏప్రిల్ మిడిల్ నాటికి సినిమా చిత్రీక‌ర‌ణ ఆద్యంతం పూర్త‌వుతుంది. మే9న ప్ర‌తిష్ఠాత్మ‌కంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ చిత్రంలో మ‌హేష్ స‌ర‌స‌న పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తోంది.

Also Read: Rashmika Shocking Statement On Lip-Locks

User Comments