మే 1న పీపుల్స్ ప్లాజా లో మ‌హ‌ర్షి ప్రీ రిలీజ్

Last Updated on by

సూపర్‌స్టార్ మహేష్ హీరోగా, సూపర్‌హిట్ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో.. వైజయంతి మూవీస్, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, పి.వి.పి సినిమా పతాకాలపై హై టెక్నికల్ వేల్యూస్‌తో రూపొందుతోన్న భారీ చిత్రం ‘మహర్షి’. సూపర్‌స్టార్ మహేష్‌కు ఇది 25వ చిత్రం కావడం విశేషం. మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 9న వరల్డ్‌వైడ్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా, ‘మహర్షి’ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను మే 1న ఎంతో గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో అభిమానుల మధ్య సాయంత్రం 6 గంటల నుండి ఈ ఫంక్షన్ జరగనుంది.

బుధవారం ఈ చిత్రంలోని నాలుగో పాటను విడుదల చేశారు. ‘పదర పదర పదరా.. నీ అడుగుకి పదును పెట్టి పదరా.. ఈ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా..’ అంటూ సాగే పాటను శ్రీమణి రచించగా దేవిశ్రీప్రసాద్ సంగీత సారధ్యంలో శంకర్ మహదేవన్ పాడారు. సూపర్‌స్టార్ మహేష్ మొదటి సినిమా ‘రాజకుమారుడు’లో ‘బాలీవుడ్ బాలరాజు’ అనే పాటను శంకర్ మహదేవన్ పాడారు. 20 సంవత్సరాల తర్వాత ‘మహర్షి’ చిత్రంలో శంకర్ మహదేవన్ పాడడం విశేషం. శంకర్ మహదేవన్ స్పందిస్తూ ‘‘సూపర్‌స్టార్ మహేష్‌బాబు ఫస్ట్ ఫిల్మ్ ‘రాజకుమారుడు’లో ‘బాలీవుడ్ బాలరాజు..’ అనే పాట పాడే అవకాశం వచ్చింది. ఒక హిస్టారికల్ మూమెంట్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్న సూపర్‌స్టార్ మహేష్‌బాబు 25వ సినిమా ‘మహర్షి’లో మళ్ళీ నాకు పాట పాడే అవకాశం వచ్చింది. ఎమోషనల్‌గా, ఇన్‌స్పిరేషనల్‌గా, స్ట్రాంగ్‌గా ఉండే పాట ఇది. ఈ పాట పాడే అవకాశం నాకు రావడం గౌరవంగా భావిస్తున్నాను` అని అన్నారు.

User Comments