మ‌రోసారి నిరాశేనా మ‌హేష్‌!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ న‌టిస్తున్న తాజా చిత్రం `స‌రిలేరు నీకెవ్వ‌రు` ప్ర‌మోష‌న‌ల్ స్ట్రాట‌జీపై అభిమానులు నిరాశ‌గా ఉన్నారా? అంటే అవున‌నే అర్థ‌మ‌వుతోంది. ఇదిగో పులి అంటే అదిగో మేక‌! అన్న చందంగా ఈ సినిమాకి సంబంధించి టీజ‌ర్ ట్రైల‌ర్ కోసం వేచి చూస్తున్న ఫ్యాన్స్ చివ‌రికి నీర‌స‌ప‌డిపోవాల్సిన ప‌రిస్థితి. ఓవైపు అల వైకుంఠపుర‌ములో చిత్రానికి సంబంధించిన ప్ర‌తి ఫోటో వీడియో అభిమానుల్లోకి దూసుకుపోతుంటే మ‌హేష్ టీమ్ ఎందుక‌ని వెన‌క‌బ‌డింది? అంటూ నిల‌దీస్తున్నారు ఘ‌ట్ట‌మ‌నేని అభిమానులు.

ఇదిగో టీజ‌ర్ మంట‌లు పెట్టేయ‌బోతోంది అంటూ ప్ర‌క‌టించినా ఇంత‌వ‌ర‌కూ టీజ‌ర్ రాక‌పోవ‌డం నిరాశ‌ప‌రిచింది. అనీల్ రావిపూడి టీజ‌ర్ వ‌చ్చేస్తుంది అంటూ జీఐఎఫ్ ఫైల్ ట్వీట్ చేయ‌డంతో అభిమానులు తీవ్రంగా నిరాశ‌ప‌డిపోయారు. ఏదో మూడు సెక‌న్ల జీఐఎఫ్ ఫైల్ ని అప్ లోడ్ చేశాడు రావిపూడి. క‌నీసం టీజ‌ర్ ట్రైల‌ర్ తేదీలు అయినా చెబుతారా? అంటూ సీరియ‌స్ అవుతున్నారు ఫ్యాన్స్. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 11న ఈ చిత్రం రిలీజ‌వుతోంది. జ‌న‌వ‌రి 1న ట్రైల‌ర్ వ‌స్తుంద‌ని ఫ్యాన్స్ భావిస్తున్నా దానికి సంబంధించి ఏ వివ‌రం అంద‌లేదు. దీంతో వీళ్లింతేనా? అంటూ కొంద‌రు సీరియ‌స్ గానే ప్ర‌శ్నిస్తున్నారు. మ‌హేష్ స‌ర‌స‌న ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న న‌టిస్తోంది. సీనియ‌ర్ న‌టి విజయ‌శాంతి కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ఏకే ఎంట‌ర్ టైన్ మెంట్స్, జిఎంబీ ఎంట‌ర్ టైన్ మెంట్స్, శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.