మ‌హేష్ Vs బ‌న్ని.. మాట‌ల్లేవా?

Ala Vaikuntapuramloo - File Photo

సూప‌ర్ స్టార్ మ‌హేష్ .. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ ఇద్ద‌రూ న‌టించిన సినిమాలు సంక్రాంతి బ‌రిలో పోటీ ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. జ‌న‌వ‌రి 12న రిలీజ్ చేస్తున్నామ‌ని నిర్మాత‌లు అధికారికంగా ప్ర‌క‌టించారు. అందుకు సంబంధించి ద‌స‌రా దీపావ‌ళికి పోస్ట‌ర్లు రిలీజ‌య్యాయి. అయితే ఒకే రోజు రెండు పెద్ద సినిమాలు రిలీజ‌వ్వ‌డం అన్న‌ది స‌మ‌స్యాత్మ‌కం. ఆ రెండు సినిమాల ఓపెనింగుల‌కు అలానే ప్రీమియ‌ర్ షోల‌కు ఇబ్బంది క‌ర‌మైన స‌న్నివేశం ఉంటుంది. క‌లెక్ష‌న్ల ప‌రంగా షేరింగ్ చేసుకోవాల్సిన స‌న్నివేశం త‌లెత్తుతుంది. ఇక థియేట‌ర్ల ప‌రంగానూ ఇష్యూస్ ఉంటాయి. అందుకే ఇటీవ‌లి కాలంలో ఈ త‌ర‌హ‌లో భారీ చిత్రాల్ని ఒకేరోజు ప్లాన్ చేయ‌డం లేదు.

అయితే సంక్రాంతి పండ‌గ క్రేజు.. సెల‌వుల్ని దృష్టిలో పెట్టుకుని ఈ రెండు భారీ చిత్రాల్ని రిలీజ్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఒకేరోజు రిలీజ్ కి రావాలా? అన్న‌దానిపై ఇరు వ‌ర్గాలు తాజాగా మాట్లాడుకుని ప‌రిష్క‌రించుకున్నార‌ట‌. తాజా స‌మాచారం మేర‌కు మ‌హేష్ న‌టిస్తున్న స‌రిలేరు నీకెవ్వ‌రు జ‌న‌వ‌రి 11న రిలీజ‌వుతుంది. ఆ మ‌రుస‌టి రోజు అంటే జ‌న‌వ‌రి 12న అల్లు అర్జున్ న‌టిస్తున్న అల వైకుంఠ‌పుర‌ములో రిలీజ‌వుతుంది. ఆ మేర‌కు గీతా ఆర్ట్స్ -హారిక బ్యాన‌ర్ల‌తో అనీల్ సుంక‌ర‌- దిల్ రాజు టీమ్ మాటా మంతీ సాగించింద‌ట‌. ఒక‌వేళ ఇదే నిజ‌మైతే మంచిదే. ఆ రెండు సినిమాల‌కు క‌లిసొస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. 2020 సంక్రాంతి బ‌రిలో ఆ ఇద్ద‌రి కంటే ముందు ర‌జ‌నీ ద‌ర్బార్ జ‌న‌వ‌రి 9న‌ రిలీజ‌వుతోంది. క‌ళ్యాణ్ రామ్ ఎంత మంచివాడ‌వురా చిత్రాన్ని దిల్ రాజు జ‌న‌వ‌రి 14న రిలీజ్ చేస్తున్నారు. ఈ నాలుగు చిత్రాల్లో రేసులో ఎవ‌రిది పైచేయి? అన్న‌ది వేచి చూడాల్సి ఉంది.