మ‌హేష్ కోసం టాప్ డైరెక్టర్ రెడీ

సూప‌ర్ స్టార్ మ‌హేష్ ప్ర‌స్తుతం `స‌రిలేరు నీకెవ్వ‌రు` చిత్రంలో న‌టిస్తున్నారు. భ‌ర‌త్ అనే నేను, మ‌హ‌ర్షి చిత్రాల‌తో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకుని ప్ర‌స్తుతం హ్యాట్రిక్ ట్ర‌య‌ల్స్ లో ఉన్నారు. ఈ సినిమా త‌ర్వాత మ‌హేష్ న‌టించే 27వ సినిమా ఎవ‌రి ద‌ర్శ‌క‌త్వంలో ఉంటుంది? అంటూ వాడి వేడిగా చ‌ర్చ సాగుతోంది.

ఇప్ప‌టికే ముగ్గురు న‌లుగురు ద‌ర్శ‌కుల పేర్లు వినిపిస్తున్నాయి. అందులో ప‌ర‌శురామ్, సందీప్ వంగాతో పాటు ఎస్.ఎస్.రాజ‌మౌళి, సుకుమార్, వంశీ పైడిప‌ల్లి త‌దిత‌రులు లిస్ట్ లో ఉన్నారు. అయితే మ‌హేష్ ముందుగా ఎవ‌రికి గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తారు. అనీల్ రావిపూడి త‌ర్వాత జాక్ పాట్ కొట్టేది ఎవ‌రు? అంటూ సోష‌ల్ మీడియాలో రెగ్యుల‌ర్ గా డిబేట్ ర‌న్ అవుతోంది. అయితే మ‌హేష్ వీళ్లెవ‌రితో కాకుండా ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేద‌న్న మాటా వినిపిస్తోంది. మ‌హేష్ హీరోగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఆర్కా మీడియా సంస్థ ఓ చిత్రాన్ని ప్లాన్ చేస్తోంది. ఆ జోడీని క‌లిపేందుకు ప్ర‌య‌త్నిస్తోంద‌ని ప్ర‌చారం సాగుతోంది. 2020లో ఈ సినిమా సెట్స్ కెళ్లే ఛాన్సుంద‌ని విన‌బ‌డుతోంది. అయితే మ‌రోవైపు సందీప్ రెడ్డి వంగా- గీతా ఆర్ట్స్ సంస్థ‌లు.. ప‌ర‌శురామ్ – మైత్రి సంస్థ ఇప్ప‌టికే క్యూలో ఉన్న సంగ‌తి తెలిసిందే. మ‌రి ముందుగా మ‌హేష్ ఎవ‌రికి ఛానిస్తారు? అన్న‌ది చూడాలి.