మ‌హేష్ ని ఇలా ఇరికిస్తున్నాడేం?

Mahesh Babu Joins Hands With a Corporate Giant

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటార‌న్న సంగ‌తి తెలిసిందే. సినిమా త‌ప్ప వేరే వ్యాప‌కం త‌న‌కు ఉండ‌ద‌ని, రాజ‌కీయాల‌పై నాలెజ్ లేద‌ని మ‌హేష్ చెబుతుంటారు. అలాగే రాజ‌కీయాల్లోకి వెళ్లాల‌న్న ఆస‌క్తి కానీ, లేదా రాజ‌కీయ పార్టీల‌కు ప్ర‌చారం చేయాల‌న్న ఉత్సాహం కానీ త‌న‌కు ఎంత మాత్రం లేద‌ని ఇదివ‌ర‌కూ ప‌లు సంద‌ర్భాల్లో చెప్పారు. అయితే రాజ‌కీయ పార్టీలు మాత్రం మ‌హేష్ ని రింగులోకి లాగే ప్ర‌య‌త్నం ఆప‌లేదు. గ‌తంలో ప‌లుమార్లు ఎన్నిక‌ల వేళ ప్ర‌చారానికి రావాల్సిందిగా ప‌లు పార్టీలు మ‌హేష్ కి ఎర‌వేశాయి. కానీ వెళ్ల‌లేదు. ఈసారి కూడా ఎన్నిక‌ల వేళ మ‌హేష్ ని బుట్ట‌లో వేసేందుకు ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయి.

ఈసారి మహేష్ చే ప్ర‌చారం చేయించుకునేందుకు అంద‌రి కంటే ముందు వ‌రుస‌లో ఉన్న‌ది టీడీపీ. ఆ మేర‌కు ఇప్ప‌టికే చంద్ర‌బాబు తెలివిగా పావులు క‌దిపారు. మ‌హేష్ బాబాయ్ ఆదిశేష‌గిరి రావును త‌మ పార్టీలోకి లాక్కోవ‌డం ద్వారా మ‌హేష్ కి గాలం వేస్తున్నార‌ని ఇప్ప‌టికే ప్ర‌చారం ఉంది. జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌మ‌కు దూర‌మైనా, మ‌హేష్ స్టార్ డ‌మ్ ప‌వ‌ర్ తో ఓట్ల‌కు గాలం వేయొచ్చ‌న్న‌ది బాబు యోచ‌న‌. అయితే మ‌హేష్ అందుకు రెడీ అంటారా? ఏపీ ఎన్నిక‌ల్లో తేదేపా త‌ర‌పున మ‌హేష్ ప్ర‌చారానికి వ‌స్తారా? అంటే ఇప్ప‌టికైతే సందేహ‌మే. చంద్ర‌బాబు ఎన్ని కుయుక్తులు ప‌న్నితే, ఆయ‌న నుంచి త‌ప్పించుకునేందుకు మ‌హేష్ కూడా అంతే తెలివిగా వ్య‌వ‌హ‌రించి స్కిప్ కొడ‌తాడ‌నే ఘ‌ట్ట‌మ‌నేని అభిమానులు భావిస్తున్నారు. త‌న‌కు అక్క‌ర‌కు రాని ప‌నిలో మ‌హేష్ అస్స‌లు త‌ల‌దూర్చ‌డు. ఆ స్వ‌భావం వ‌ల్ల అత‌డు పూర్తిగా రాజ‌కీయాల‌కు దూరంగా ఉండే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. మ‌రోవైపు మ‌హేష్ ప్ర‌స్తుతం వ‌రుస‌గా సినిమాల‌కు సంత‌కాలు చేసి క్ష‌ణం తీరిక లేకుండా ఉన్నాడు. మ‌హర్షి షూటింగ్ పూర్త‌వుతోంది అన‌గానే సుకుమార్ తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. అర్జున్ రెడ్డి డైరెక్ట‌ర్, ఎఫ్ 2 డైరెక్ట‌ర్ ఇప్ప‌టికే మ‌హేష్ కి క‌థ చెప్పి ఒప్పించారు. వీటికి సంబంధించిన డిస్క‌ష‌న్స్ లో మ‌హేష్ బిజీ. అందువ‌ల్ల రాజ‌కీయాల‌పై దృష్టి సారించేంత స‌మ‌యం ఉండ‌దు. ఒక‌వేళ స‌మ‌యం ఉన్నా త‌న‌కు ఆ ప‌ని ఇష్టం లేదు కాబ‌ట్టి స్కిప్ కొట్ట‌డం ఖాయం అని తెలుస్తోంది.