షాక్‌: మ‌హేష్ ఫ్యాన్ సూసైడ్‌

Last Updated on by

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ అభిమాని ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం క‌ల‌క‌లం రేపింది. స‌ద‌రు అభిమాని ఆత్మ‌హ‌త్య‌కు ముందు త‌న ఫేవ‌రెట్ మ‌హేష్‌కి ఓ సూసైడ్ నోట్ రాయ‌డం సంచ‌ల‌న‌మైంది. వివ‌రాల్లోకి వెళితే… గుంటూరు జిల్లాకు చెందిన పులి సునంద్ కుమార్ రెడ్డి ఐఐఐటి -హైద‌రాబాద్ క్యాంప‌స్‌లో నాలుగో ఏడాది సీఎస్‌డీ స్టూడెంట్‌. క్యాంప‌స్ హాస్టల్లోనే ఉంటూ చ‌దువుకుంటున్నాడు. అయితే అత‌డు ఆత్మ‌హ‌త్య చేసుకుంటూ త‌ల్లిదండ్రుల‌కు ఓ సూసైడ్ నోట్‌, మ‌హేష్‌కి వేరొక సూసైడ్ నోట్ రాసి ఆ ప‌ని చేశాడు.

అయితే సునంద్ కుమార్ ఆత్మ‌హ‌త్య చేసుకునేంత పిరికివాడు కాడ‌ని స్నేహితులు అంటున్నారు. అత‌డు కాలేజ్‌లో మెరిట్ స్టూడెంట్. మంచి మార్కులు వ‌స్తున్నాయి. అక‌డ‌మిక్ స్ట‌డీస్‌లో ఏనాడూ డిప్రెష‌న్ ఫీల‌య్యాడ‌న్న రిమార్క్ లేనేలేద‌ని కాలేజ్ వాళ్లు చెబుతున్నారు. ఇక అత‌డు మ‌హేష్‌కి తొలి నుంచి వీరాభిమాని. అత‌డు ఉంటున్న హాస్ట‌ల్ రూమ్‌లోనూ గోడ‌ల‌పై మ‌హేష్ పోస్ట‌ర్లు అంటించి ఉంటాయి. సూసైడ్ నోట్‌లో మ‌హేష్ గురించి ప్ర‌స్థావిస్తూ.. మ‌హేష్ అంటే త‌న‌కు ఎంతో ఇష్ట‌మ‌ని, అత‌డి సినిమాల‌న్నీ చూసేశాన‌ని అత‌డు పేర్కొన్నాడు. ఓవైపు భ‌ర‌త్ విజ‌యోత్స‌వ యాత్ర‌లో ఉన్న మ‌హేష్‌కి ఇది నిజంగానే పెద్ద షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

User Comments