మ‌హేష్ విగ్ర‌హానికి ప్రాణ ప్ర‌తిష్ఠ‌

Last Updated on by

సూప‌ర్ స్టార్ మ‌హేష్ మైన‌పు విగ్ర‌హాన్ని నేడు మ్యాడ‌మ్ టుస్సాడ్స్ నిర్వాహ‌కులు హైద‌రాబాద్ ఏఎంబీ మాల్ లో ఆవిష్క‌రించారు. నేటి ఉద‌యం ప్రారంభోత్స‌వంలో మ‌హేష్ స‌హా న‌మ్ర‌త‌, సితార, గౌత‌మ్ పాల్గొన్నారు. మేడ‌మ్ టుస్సాడ్స్ త‌ర‌ఫున అలెక్స్, ఏవీ యంగ్ కాంగ్ త‌దిత‌రులు ఈవెంట్ లో పాల్గొన్నారు. ఇక ఈ విగ్ర‌హాన్ని భారీగా అభిమానుల స‌మ‌క్షంలో మ‌హేష్ స్వ‌యంగా ఆవిష్క‌రించారు. అచ్చం మ‌హేష్ ని పోలి ఉన్న ఈ విగ్ర‌హానికి అభిమానులు స‌హా క్రిటిక్స్ నుంచి ప్ర‌శంస‌లు ద‌క్కాయి. మ్యాడ‌మ్ టుస్సాడ్స్ – సింగ‌పూర్ ప్ర‌తినిధులకు ప్ర‌శంస‌లు వెల్లువెత్తాయి.
విగ్ర‌హావిష్క‌ర‌ణ‌లో మ‌హేష్ మాట్లాడుతూ .. ఈ విగ్ర‌హాన్ని సింగ‌పూర్ లో ఆవిష్క‌రించాల్సి ఉంది. అయితే సినిమాల‌తో బిజీగా ఉండ‌డం వ‌ల్ల కాల్షీట్ల స‌మ‌స్య త‌లెత్తింది. అందుకే హైద‌రాబాద్ లో ఈ విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించాల్సిందిగా కోరామ‌ని తెలిపారు. హైద‌రాబాద్ లో అభిమానుల స‌మ‌క్షంలో .. మా ఫ్యామిలీ స‌మ‌క్షంలో విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించ‌డం ఆనందంగా ఉంది. సితార, గౌత‌మ్ ఎంతో సంతోషించారు. సింగ‌పూర్ కి త‌ర‌లించే లోపు ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు ఈ సెల‌బ్రేష‌న్ ని అని మ‌హేష్ అన్నారు. గ‌త ఏడాది మ్యాడ‌మ్ టుస్సాడ్స్ నిర్వాహ‌కులు కొల‌త‌లు తీసుకున్నార‌ని తెలిపారు. విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు ముందే ఆ ఫోటోల్ని టుస్సాడ్స్ బృందం పంపించింద‌ని, న‌మ్రత స‌హా స‌న్నిహితుల‌కు షేర్ చేశాన‌ని మ‌హేస్ తెలిపారు. ఏదో ఫోటోషూట్ చేశాన‌ని ఆ విగ్ర‌హాన్ని చూశాక అనుకున్నార‌ని తెలిపారు. నిర్వాహ‌కులు ప్రాణ ప్ర‌తిష్ఠ చేశార‌ని ప్ర‌శంసించారు. ఇవ‌నా్ రీజ్, బెంటానా త‌దిత‌ర తుస్సాడ్స్ బృందానికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఎంద‌రో అభిమానులు కోరుకున్నారు కాబ‌ట్టే మ‌హేష్ విగ్ర‌హాన్ని సింగ‌పూర్ టుస్సాడ్స్ లో ఆవిష్క‌రిస్తున్నామ‌ని, సంద‌ర్శ‌కుల కోసం ఉంచుతామ‌ని టుస్సాడ్స్ ప్ర‌తినిధులు తెలిపారు. 200 కొల‌త‌లు తీసుకుని 20 మంది ఆరు నెల‌ల పాటు ఈ విగ్ర‌హం కోసం ప‌ని చేశార‌ని వెల్ల‌డించారు.

User Comments