సౌతాఫ్రికా జంగిల్స్ కి మ‌హేష్‌

Last Updated on by

సూప‌ర్ స్టార్ మ‌హేష్ క‌థానాయ‌కుడిగా 25వ సినిమా మ‌హ‌ర్షి ఆన్ సెట్స్ ఉన్న సంగ‌తి తెలిసిందే. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో దిల్ రాజు- అశ్వ‌నిద‌త్ – పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాని మే 9న రిలీజ్ చేస్తున్నామ‌ని, నిర్మాణానంత‌ర ప‌నులు పూర్తి చేస్తున్నామ‌ని దిల్ రాజు తెలిపారు. ఈ సినిమా త‌ర్వాత ఎఫ్ 2 ద‌ర్శ‌కుడు అనీల్ రావిపూడితో ఓ సినిమాకి సంత‌కం చేసిన సంగ‌తి తెలిసిందే. అనీల్ సుంక‌ర – దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మ‌రోవైపు కేజీఎఫ్ ఫేం ప్ర‌శాంత్ నీల్, సుకుమార్, సందీప్ వంగ వంటి ద‌ర్శ‌కుల‌తో త‌దుప‌రి సినిమాల‌కు సంబంధించిన చ‌ర్చ‌ల్ని మ‌హేష్ సాగిస్తున్నారు.

ప‌నిలో ప‌నిగా ఈ గ్యాప్ లో మ‌హేష్ దక్షిణాఫ్రికా వెళ్లార‌ని తెలుస్తోంది. అక్క‌డ థ‌మ్స‌ప్ వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ను తెర‌కెక్కిస్తున్నార‌ట‌. ప్ర‌ఖ్యాత కోలా బ్రాండ్ థ‌మ్స‌ప్ కి జాతీయ బ్రాండ్ అంబాసిడ‌ర్ గా మ‌హేష్ ఏడాదికి కోట్ల‌లో పారితోషికం అందుకుంటున్నారు. ఈ ప్ర‌క‌ట‌న కోసం డేర్ డెవిల్ స్టంట్స్ తో వ్యాల్యూ పెంచిన సంగ‌తి తెలిసిందే. టాలీవుడ్ నుంచి మ‌హేష్, ఇత‌ర భాష‌ల నుంచి వేరే హీరోల్ని థ‌మ్స‌ప్ బ్రాండ్ అంబాసిడ‌ర్స్ గా ఎంపిక చేసుకుని వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల్ని రూపొందిస్తోంది. ప్ర‌స్తుతం ద‌క్షిణాఫ్రికాలోని అంద‌మైన లొకేష‌న్ల‌లో ప్ర‌క‌ట‌న‌ను చిత్రీక‌రిస్తున్నార‌ట‌.

User Comments