మ‌హేష్ 2 డికేడ్ కెరీర్‌

Last Updated on by

అప్పుడే అమెరికాలో చ‌దువులు పూర్తి చేసుకుని నూనూగు మీసాల రాకుమారుడు హైద‌రాబాద్‌లో దిగాడు. దిగుతూనే ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు కంట ప‌డ్డాడు. ఇంకేం ఉంది.. ఇత‌డిని పెట్టి `రాజ‌కుమారుడు` సినిమా తీస్తే పోలా? అని ఆలోచించాడు ఆయ‌న‌. ఇంకేం ఉంది.. స్క్రిప్టు రెడీ.. సూప‌ర్‌స్టార్ కృష్ణ సైసై. వెంట‌నే ప్ర‌కాష్‌రాజ్‌ని సంప్ర‌దించి మామ పాత్ర ఉంది న‌టిస్తావా? అని అడిగారు. అలా మ‌హేష్‌-ప్ర‌కాష్‌రాజ్‌- రాఘ‌వేంద్ర‌రావు కాంబినేష‌న్‌లో వైజ‌యంతి మూవీస్ అధినేత అశ్వ‌నిద‌త్ `రాజ‌కుమారుడు` చిత్రాన్ని నిర్మించారు. ఈ క్రేజీ మూవీకి మ‌ణిశ‌ర్మ సంగీతం అందించారు.

మ‌హేష్ తొలి సినిమా `రాజ‌కుమారుడు` రిలీజై నేటితో 19 సంవ‌త్స‌రాలు పూర్త‌యింది. 30జూలై 1999లో తొలి సినిమా రిలీజై బంప‌ర్‌హిట్ కొట్టింది. ఇప్ప‌టికి మ‌హేష్ సినీజ‌ర్నీ వ‌య‌సు 19. వ‌చ్చే ఏడాదితో రెండు ద‌శాబ్ధాల కెరీర్ పూర్తి చేసుకోబోతున్నాడు. ఇది ఓ స్టార్‌కి నిజంగానే గ్రేట్ ఫీట్ అనే చెప్పాలి. మ‌హేష్ ఇప్పుడు 200 కోట్ల క్ల‌బ్ హీరో. `భ‌ర‌త్ అనే నేను` చిత్రంతో ఆ ఫీట్ అందుకున్నాడు. ఇక‌పైనా ఇంత‌కుమించి ఇంకా ఇంకా సాధిస్తాడ‌నే ఆకాంక్షిద్దాం.

User Comments