మ‌హేష్ స్వీట్ షాక్‌

Last Updated on by

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ న‌టించిన `భ‌ర‌త్ అనే నేను` బంప‌ర్ హిట్ కొట్టిన సంగ‌తి తెలిసిందే. ఆ క్ర‌మంలోనే రెట్టించిన ఉత్సాహంతో వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో త‌న కెరీర్ 25వ సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ చిత్రంలో మ‌హేష్ రైతు పాత్ర‌లో క‌నిపిస్తాడ‌ని తెలుస్తోంది. ఇంకా చెప్పాలంటే రైతు బాంధ‌వుడుగా అద‌ర‌గొడ‌తాడ‌ట‌. అలానే ఈ చిత్రంలో అల్ల‌రి న‌రేష్ ఓ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. అస‌లు మ‌హేష్ 25 అన్న ప్ర‌స్థావ‌న త‌ప్ప‌ ఈ సినిమా టైటిల్ ఏంటి? అన్న‌దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.

ఓ క్లోజ్ సోర్సెస్ ప్ర‌కారం.. ఆగ‌స్టు 9న మ‌హేష్ పుట్టిన‌రోజు కానుక‌గా టైటిల్‌ని ప్ర‌క‌టించి, ఫ‌స్ట్‌లుక్ లాంచ్ చేయ‌నున్నార‌ని తెలుస్తోంది. అలానే ఉగాది కానుక‌గా 5 ఏప్రిల్, 2019న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్నార‌ని స‌మాచారం. వంశీ పైడిప‌ల్లి – దేవీశ్రీ కాంబో ఈ చిత్రానికి అద్భుత‌మైన ట్యూన్ల‌ను రెడీ చేస్తున్నార‌ట‌. ముంబై గాళ్ పూజా హెగ్డే ఈ చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తోంది. హిమాల‌యాల్లోని డార్జిలింగ్‌లో ఈ సినిమా చిత్రీక‌ర‌ణ సాగుతున్న సంగ‌తి తెలిసిందే. త‌దుప‌రి అమెరికాలో కీల‌క షెడ్యూల్‌ని చిత్రీక‌రించ‌నున్నారు.

User Comments