మ‌హేష్ 26 వెద‌ర్‌ వేడెక్కుతోంది!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ త‌న కెరీర్ 25వ సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో `మ‌హ‌ర్షి` చిత్రీక‌ర‌ణ ప్ర‌స్తుతం ముగింపులో ఉంది. ఎల‌క్ష‌న్ .. మే 9న సినిమాని రిలీజ్ చేస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు. ఈ సినిమా సెట్స్ లో ఉండ‌గానే వ‌రుస‌గా మ‌హేష్ ప‌లు క్రేజీ ప్రాజెక్టుల‌కు సంత‌కాలు చేస్తున్నారు.

ఇప్ప‌టికే అనీల్ రావిపూడితో సినిమా క‌న్ఫామ్ అయ్యింది. సుకుమార్ తో జ‌స్ట్ మిస్స‌య్యింది. క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ తో ఆ ప్రాజెక్టును క్యాన్సిల్ చేస్తున్నామ‌ని మ‌హేష్ స్వ‌యంగా ప్ర‌క‌టించారు. `అర్జున్ రెడ్డి` ద‌ర్శ‌కుడు సందీప్ వంగా స్క్రిప్టు ఇంకా డైలెమాలో ఉంద‌న్న వార్త‌లు వ‌చ్చాయి. ప‌లువురు స్టార్ డైరెక్ట‌ర్లు మ‌హేష్ కి క‌థ వినిపించే ఆస‌క్తితో ఉన్నారు. మ‌హ‌ర్షి రిలీజ్ బ‌రిలోకి వ‌చ్చేసింది కాబ‌ట్టి త‌దుప‌రి సినిమాలపై మ‌హేష్ సీరియ‌స్ గా దృష్టి సారిస్తున్నార‌ని అర్థ‌మ‌వుతోంది. ఈలోగానే తాజా ప్రాజెక్టుకు సంబంధించి మ‌రో వేడెక్కించే అప్ డేట్ అందింది. మ‌హేష్- అనీల్ రావిపూడి మూవీ హీట్ పీక్స్ కి చేరుకుంద‌ని తెలుస్తోంది. ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌ల‌కు ఎంపిక‌లు సాగుతున్నాయి. క‌న్న‌డ సూప‌ర్‌స్టార్ ఉపేంద్ర .. రాముల‌మ్మ విజ‌య‌శాంతి కీల‌క పాత్ర‌లకు ఎంపికయ్యార‌ని తెలుస్తోంది. అలాగే క‌థానాయిక‌గా ప‌లువురు బాలీవుడ్ భామ‌ల పేర్లు ప‌రిశీలన‌లో ఉన్నాయ‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. రేసులో క‌త్రిన పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. ఇక ఈ సంగ‌తుల్ని చిత్ర‌యూనిట్ అధికారికంగానూ క‌న్ఫామ్ చేయాల్సి ఉందింకా. మ‌రోవైపు ప్రీప్రొడ‌క్ష‌న్ టీమ్ నుంచి కొన్ని విష‌యాలు లీక‌య్యాయి. జూలై నుంచి రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ‌కు వెళ్ల‌నున్నారు. ప్ర‌స్తుతం ప్రీప్రొడ‌క్ష‌న్ స్వింగులో ఉంది. `వాట్స్ అప్‌` అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంద‌ని తెలుస్తోంది. 2020 సంక్రాంతి రిలీజ్ చేయాల‌న్న‌ది ప్లాన్. ఏటీవీ అనీల్ సుంక‌ర – దిల్ రాజు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.