మ‌హేష్ 26 .. మ‌రో మ‌ల్టీస్టార‌ర్‌?

Last Updated on by

మ‌ల్టీస్టార‌ర్ ట్రెండ్ పీక్స్‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. అన‌వ‌స‌ర ఈగోల‌కు పోకుండా ఇత‌ర హీరోల‌తో క‌లిసి న‌టించేందుకు స్టార్‌ హీరోలు సంసిద్ధంగా ఉంటున్నారు. టాలీవుడ్‌ని మ‌రో బాలీవుడ్ అంత తేలిక చేసేస్తున్నారు. వెంకీ, నాగార్జున లాంటి స్టార్లు ఈగోల‌కు తావు లేకుండా త‌మ స్థాయిని నిల‌బెట్టుకుంటూ ఇత‌ర స్టార్ల‌తో సినిమాలు చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. యువ‌హీరోల‌కు ఆ ఛాన్సిస్తున్నారు.

ఈ ఛేంజోవ‌ర్‌లో మ‌రో కొస‌మెరుపు. ఇటీవ‌లి కాలంలో ఇప్పుడున్న అర‌డ‌జ‌ను స్టార్లు ఒక‌రినొక‌రు వృత్తిగ‌తంగా, వ్య‌క్తిగ‌తంగా క‌లుపుకుని వెళుతూ క‌లిసి సినిమాలు చేసేందుకు లైన్ క్లియ‌ర్ చేశారు. ఒక‌రి సినిమాలో ఇంకొక‌రు కామియోలు, లేదా పూర్తి స్థాయి పాత్ర‌లో చేసేందుకు ఎవ‌రూ అభ్యంత‌రం చెప్ప‌డం లేదు. ప్ర‌స్తుతం ఆన్‌సెట్స్ ఉన్న మ‌హేష్ సినిమా మ‌హ‌ర్షి అదే కోవ‌లో మ‌ల్టీస్టార‌ర్ మూవీ. మ‌హేష్‌తో క‌లిసి అల్ల‌రిన‌రేష్ ఈ చిత్రంలో కీల‌క భూమిక పోషిస్తున్నాడు. తదుప‌రి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలోని 26వ సినిమా మ‌రో మ‌ల్టీస్టార‌ర్ కాబోతోంద‌న్న సింప్ట‌మ్స్ అందాయి. సుకుమార్ చాలా గ్యాప్ తీసుకుని మ‌హేష్ కోసం స్క్రిప్టు చెక్కుతున్నాడు. ఇందులో 20 నిమిషాల పాటు వేర‌క స్టార్ హీరోకి స‌రిపోయే రోల్ క్రియేట్ చేశాడ‌ని తెలుస్తోంది. ఆ పాత్ర‌కు డార్లింగ్ ప్ర‌భాస్ అయితే బావుంటుంద‌న్న‌ది సుక్కూ ప‌ట్టుద‌ల అట‌. ఒక‌వేళ డార్లింగ్‌కి వీలుప‌డ‌క‌పోతే ఎన్టీఆర్ లేదా చ‌ర‌ణ్‌ని ఒప్పించే ప్ర‌య‌త్నం చేస్తాడ‌ని చెప్పుకుంటున్నారు. ఆ 20 నిమిషాల రోల్ నిజ‌మైతే మ‌రో సెన్సేష‌న్‌కి సుక్కూ స్పాట్ పెట్టాడ‌నే భావించ‌వ‌చ్చు. ప్ర‌భాస్, ఎన్టీఆర్, చ‌ర‌ణ్ ఈ ముగ్గురూ మ‌హేష్‌కి క్లోజ్ ఫ్రెండ్స్‌. వీళ్లు ఒక‌రికోసం ఒక‌రు ప్ర‌చారం చేసుకుంటున్నారు. అభిమానులంద‌రినీ క‌లిపేసుకుంటున్నారు. అందువ‌ల్ల సుక్కూ ఐడియా బాగానే వ‌ర్క‌వుట్ అయ్యేట్టే క‌నిపిస్తోంది.

User Comments