హెల్మెట్‌పై మ‌హేష్ సందేశం

Last Updated on by

రాఖీ పండుగ అంటే అన్నా చెల్లెళ్ల అనుబంధం, సోద‌ర‌సోద‌రీమ‌ణుల మ‌ధ్య కానుక‌లు ఇచ్చి పుచ్చుకోవ‌డాలు అనాదిగా వ‌స్తున్న సాంప్ర‌దాయం. రాఖీ క‌ట్టి స్వీటు తినిపించి, ఏదో ఒక గిఫ్ట్ కొనిచ్చేస్తే స‌రిపోతుంది అన్న‌ది పాత ప‌ద్ధ‌తి. దానికంటే ఏదైనా ఉన్న‌త‌మైన, ప్ర‌యోజ‌న‌క‌ర‌మైన ప‌ని చేయ‌డం ఇప్పుడు అత్యావ‌శ్య‌కం. ఈ విష‌యాన్ని గ్ర‌హించిన మ‌హేష్ కాస్తంత ముందుగానే ఓ తెలివైన ప‌ని చేశాడు. హెల్మెట్ లేకుండా రోడ్ యాక్సిడెంట్ల‌లో ప్రాణాలు కోల్పోతూ అయినావాళ్ల‌కు మ‌నోవేద‌న మిగులుస్తున్న కుర్రాళ్ల‌ వైనంపై త‌న‌దైన శైలిలో వివ‌రిస్తూ.. ఓ వీడియో సందేశాన్ని అక్క‌జెళ్లెల్ల కోసం పంపించాడు.

ఈనెల 26న ర‌క్షాబంధ‌న్ సంద‌ర్భంగా ఇప్పుడే రాఖీ ప్ర‌చారం కొత్త‌గా మొద‌లెట్టాడు మ‌హేష్. దేశంలో జ‌రిగే యాక్సిడెంట్స్‌లో రోజుకు 28 మంది హెల్మెట్లు పెట్టుకోక‌పోవ‌డం వ‌ల్ల చ‌నిపోతున్నారు.. దీన‌ర్థం 28 కుటుంబాలు వాళ్లు ప్రేమించే మ‌నుషుల్ని కోల్పోతున్నారనే క‌దా! అంటూ మ‌హేష్‌ ప్ర‌శ్నించాడు. ఇట్స్ టైమ్ ఫ‌ర్ ఏ ఛేంజ్‌. ఈ ర‌క్షాబంధ‌న్‌కి మీ అన్న‌య్య‌కు, త‌మ్ముడికి ఒక హెల్మెట్ గిఫ్ట్‌గా ఇవ్వండి. అది త‌ప్ప‌కుండా పెట్టుకోమ‌నండి. ఏ లైఫ్ సేవ్డ్ ఈజ్ ఏ ఫ్యామిలీ సేవ్డ్‌. సిస్ట‌ర్స్ ఫ‌ర్ ఛేంజ్ అంటూ త‌న‌దైన శైలిలో సందేశం ఇచ్చాడు. దీనికి అభిమానుల నుంచి స్పంద‌న బావుంది. వేలల్లో త‌గ‌లేసి గిఫ్టులు కొనిచ్చే కంటే వెయ్యి లోపే ఖ‌ర్చు చేసి హెల్మెట్ కొనిస్తే ప్రాణాన్ని కానుక‌గా ఇచ్చిన‌ట్టే క‌దా! అంటూ ప్ర‌తిస్పందించారు. నిజ‌మే .. ఇది ఎంతో ఆలోచించ‌ద‌గ్గ‌ది. వింటున్నారా డియ‌ర్ సిస్ట‌ర్స్?

User Comments