జన‌వ‌రి 26.. వి ఆర్ వెయిటింగ్

Last Updated on by

ఇప్పుడు జ‌వ‌న‌రి 26 కోసం ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు. ఆ రోజు సినిమాల‌తో పాటు రెండు పెద్ద సినిమాల‌కు సంబంధించిన ఫ‌స్ట్ లుక్ ప్ల‌స్ పాట‌లు కూడా విడుద‌ల కానున్నాయి. అందుకే అంత‌గా వేచి చూస్తున్నారు ఫ్యాన్స్. జ‌న‌వ‌రి 26న రిపబ్లిక్ డే సంద‌ర్భంగా భ‌ర‌త్ అనే నేను ఫ‌స్ట్ ఓత్ విడుద‌ల కానుంది. అంటే ప్ర‌మాణ స్వీకారం అన్న‌మాట‌. కొర‌టాల శివ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. షూటింగ్ ప్ర‌స్తుతం హైద్రాబాద్ లోనే జ‌రుగుతుంది. ఇదే నెల‌లో షూటింగ్ పూర్తి కానుంది కూడా. కైరా అద్వానీ హీరోయిన్. జ‌న‌వ‌రి 26న త‌న ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేయ‌నున్నాడు మ‌హేశ్. ఇక ఈ చిత్ర శాటిలైట్ రైట్స్, ఆడియో రైట్స్ భారీ రేట్ కు అమ్ముడయ్యాయి. ఈ చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా 100 కోట్ల‌కు పైగానే జ‌రుగుతుంది.
ఇక మ‌హేశ్ తో పాటు బ‌న్నీ కూడా జ‌న‌వ‌రి 26నే ట్రీట్ ఇవ్వ‌బోతున్నాడు. ఈయ‌న న‌టిస్తున్న నా పేరు సూర్య టీజ‌ర్ ఇప్ప‌టికే సంచ‌ల‌నం సృష్టిస్తుంది. ఇక ఇప్పుడు ఇందులో తొలిపాట సైనికాను విడుద‌ల చేయ‌నున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. విశాల్ శేఖ‌ర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్ర శాటిలైట్ రైట్స్ ఇప్ప‌టికే 24కోట్ల‌కు అమ్ముడ‌య్యాయి. మొత్తానికి జ‌న‌వ‌రి 26న ఇటు మ‌హేశ్.. అటు అల్లుఅర్జున్ ఇద్ద‌రూ త‌మ అభిమానుల‌కు ఫుల్ ట్రీట్ ఇవ్వ‌బోతున్నారు. అందుకే అంటున్నారు అభిమానులంతా ఇప్పుడు వి ఆర్ వెయిటింగ్ అని..!

User Comments