మ‌హేష్ టైటిల్‌పై లీకులు

Last Updated on by

Last updated on August 7th, 2018 at 10:42 pm

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ త‌న‌ కెరీర్ 25వ సినిమా టైటిల్ ఏంటి? ఇన్నాళ్లు ఈ సినిమా టైటిల్‌ని అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు. ఈనెల 9న మ‌హేష్ పుట్టిన‌రోజు సంద‌ర్భ ంగా టైటిల్‌ని ప్ర‌క‌టించ‌నున్నారు. అలాగే ఫ‌స్ట్‌లుక్‌ని ఆరోజు అవిష్క‌రించ‌నున్నారు. ఇటీవ‌లే మ‌హేష్ గారాల ప‌ట్టీ సితార మ‌హేష్ 25 ఎంబ్ల‌మ్‌ని రిలీజ్ చేసిన సంగ‌తి తెలిసిందే.

అయితే టైటిల్ విష‌యంలో సస్పెన్స్ ని లీడ్ చేస్తూ చిత్ర‌బృందం అంత‌కంత‌కు వేడి పెంచుతోంది. ఈ సినిమా టైటిల్‌కి సంబంధించి స‌స్పెన్స్ ని లీడ్ చేస్తూ ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి టీమ్‌ ఒక్కో అక్షరాన్ని రివీల్ చేస్తూ అభిమానుల్లో ఆస‌క్తి పెంచుతున్నారు. రెండు రోజుల క్రితం చిత్ర బృందం R అనే అక్షరాన్ని విడుదల చేసింది. ఆ తర్వాత I అక్షరాన్ని రిలీజ్ చేశారు. ఈరోజు s అక్షరాన్ని దర్శకుడు వంశీ పైడిపల్లి ట్విటర్‌ ద్వారా విడుదల చేశారు. ఈ అక్షరాలకు అర్థం వివరిస్తూ పోస్టర్లను రిలీజ్ చేశారు. ఈ అక్ష‌రాల్ని బ‌ట్టి ఈ సినిమాకి టైటిల్ ని ఎవ‌రికి వారు గెస్ చేస్తున్నారు. ఆర్ఐఎస్ అక్ష‌రాల్ని వ‌రుస‌గా రిలీజ్ చేశారు కాబ‌ట్టి `రిషి` అన్న టైటిల్ ఖాయ‌మై ఉంటుంద‌ని అభిమానులు భావిస్తున్నారు. అప్ప‌ట్లో రైతు బిడ్డ అనే టైటిల్ ప్ర‌చార‌మైనా ఆ టైటిల్ కాద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. సోష‌ల్ మీడియాలోనూ రిషి అన్న టైటిల్‌ని నెటిజ‌నులు క‌న్ఫామ్ చేసేసి హ్యాష్‌ట్యాగ్‌తో ప్ర‌చారం చేస్తున్నారు. 2019 ఏప్రిల్ 5న సినిమా రిలీజ్ కానున్న సంగ‌తి తెలిసిందే.

User Comments