మ‌హేష్, బ‌న్నీ వల్ల ఇండస్ట్రీకి నష్టమే

ఇండ‌స్ట్రీలో వాళ్లేం చిన్న హీరోలు కాదు.. స్టార్ హీరోలు. ఒక్కొక్క‌రికీ 70 కోట్ల‌కు పైగానే మార్కెట్ ఉంది. ఇద్ద‌రు హీరోలు ఒకేరోజు వ‌స్తే ఇద్ద‌రికీ న‌ష్టం అని వాళ్లకు కూడా తెలుసు. తెలిసి కూడా వాళ్లు ఆడుకుంటున్నారు. ఇన్నాళ్లూ ఏదో తెలియ‌కుండా ముందుగానే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసారు.. చివ‌రి వ‌ర‌కు ఖచ్చితంగా ఎవ‌రో ఒక‌రు వెన‌క‌డుగు వేస్తారులే అనుకున్నారంతా. కానీ వాళ్ళ పంథానికి ఇప్పుడు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర యుద్ధం క‌న్ఫ‌ర్మ్ అయ్యేలా ఉంది. వాళ్లే మ‌హేష్ బాబు అండ్ అల్లుఅర్జున్ అని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. వీళ్లు న‌టిస్తోన్న భ‌ర‌త్ అనే నేను.. నా పేరు సూర్య ఏప్రిల్ 26కి ప్రీ పోన్ అయ్యాయి. ఏప్రిల్ 27న రావాల్సిన ఈ రెండు సినిమాలు ఒకేసారి త‌మ విడుద‌ల తేదీ మార్చుకున్నాయి. హ‌మ్మ‌య్యా.. ఇద్ద‌రూ వేర్వేరు తేదీల‌కు వెళ్లిపోతున్నార‌మో అనుకుంటే.. మ‌ళ్లీ ఇద్ద‌రూ ఒకేరోజు రావ‌డానికి ఫిక్స‌య్యారు.

వీళ్ళ క‌థ చూస్తుంటే కావాల‌నే చేస్తున్న‌ట్లు అనిపించ‌క మాన‌దు. ఏప్రిల్ 27 నుంచి ఒక‌రోజు ముందుకు వ‌చ్చారు ఈ హీరోలిద్ద‌రూ. అంటే ఏప్రిల్ 26న అన్నమాట. ఇలా ఒకే రోజు ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు వస్తే ఇండస్ట్రీకి ఎంత నష్టమో ఆ నిర్మాతలకు తెలియదా..? తెలుసు అయినా పంతం వదిలేలా లేరు. ఎందుకంటే అప్ప‌ట్లో బ‌న్నీవాసు త‌మ‌కు చెప్ప‌కుండా మ‌హేష్ సినిమా విడుదల తేదీ అనౌన్స్ చేసార‌ని అస‌హ‌నం వ్య‌క్తం చేసారు. అదే ఇంకా మ‌న‌సులో పెట్టుకుని కావాల‌నే ఇగో క్లాష్ తో ఇద్ద‌రూ ఒకేరోజు వ‌స్తున్నారేమో అనిపిస్తుంది ఇప్పుడు ప‌రిస్థితులు చూస్తుంటే. లేక‌పోతే మ‌రేంటి.. ఇద్ద‌రు టాప్ హీరోల సినిమాలు ఒకేరోజు వ‌స్తే ఎంత దారుణంగా ఉంటుందో అంద‌రికీ తెలిసిందే. ఇప్పుడు వీళ్లిద్ద‌రూ క‌లిసి ర‌జినీకాంత్ కు దారిస్తున్నారు. ఈయ‌న కాలా సినిమా ఏప్రిల్ 27న సోలోగా విడుదల కానుంది. మొత్తానికి ఈ వార్ అంతా ఎక్క‌డ మొద‌లై.. ఎక్క‌డ ముగియ‌నుందో..!

User Comments