స‌మ్మ‌ర్ 2018.. హౌజ్ ఫుల్..

స‌మ్మ‌ర్ 2018…

సంక్రాంతికి ఇంకా రెండు నెల‌లే టైమ్ ఉంది. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రెవ‌రు వ‌స్తున్నారో క్లారిటీ లేదు. కానీ స‌మ్మ‌ర్ కు ఇంకా ఆర్నెళ్ల‌కు పైగా టైమ్ ఉంది. అప్పుడే ఆ సీజ‌న్ లో ఏయే హీరోలు వ‌స్తున్నారో క్లారిటీ వ‌చ్చేసింది. ఎన్ని సంక్రాంతులు వ‌చ్చినా.. ద‌స‌రాలు వ‌చ్చినా.. స‌మ్మ‌ర్ సీజ‌న్ కు ఉండే గిరాకీ వేరు. నెల రోజుల‌కు పైగా ఉండే హాలీడేస్ ను క్యాష్ చేసుకోడానికి ప్ర‌తీ హీరో ట్రై చేస్తుంటాడు. వాళ్ల టార్గెట్ ను స‌మ్మ‌ర్ కే ఫిక్స్ చేసుకుంటారు. ఇప్పుడు మ‌న హీరోలు కూడా ఇదే చేస్తున్నారు.

సంక్రాంతి మిస్ అయినా.. స‌మ్మ‌ర్ ను ల‌క్ష్యంగా చేసుకుని దూసుకెళ్తున్నారు. ఈ లిస్ట్ లో చ‌ర‌ణ్, మ‌హేశ్ ఉన్నారు. అయితే వీళ్ల‌కంటే ముందే స‌మ్మ‌ర్ 2018ని అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న హీరో అల్లుఅర్జున్. ఓ ర‌కంగా చెప్పాలంటే స‌మ్మ‌ర్ కు ద‌త్త‌పుత్రుడు బ‌న్నీ. 2014 నుంచి వ‌ర‌స‌గా స‌మ్మ‌ర్ లో వ‌స్తున్నాడు ఈ హీరో. రేసుగుర్రం.. స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి.. స‌రైనోడు.. డిజే.. ఇలా 2018లో నా పేరు సూర్య‌.. ఎప్రిల్ 27న ఈ చిత్రం విడుద‌ల కానుంది.

సంక్రాంతికి రావాల‌నుకున్న మ‌హేశ్ భ‌ర‌త్ అను నేను స‌మ్మ‌ర్ కు వాయిదా ప‌డింది. స్పైడ‌ర్ కార‌ణంగా ఆల‌స్యం కావ‌డంతో ఈ చిత్రాన్ని వేస‌వికి వాయిదా వేసారు. బ‌న్నీ కంటే వారం ముందు.. అంటే ఎప్రిల్ 20న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయాల‌నేది ద‌ర్శ‌క నిర్మాతల ప్లాన్. కొర‌టాల తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో కైరాఅద్వాని హీరోయిన్. ఇక రామ్ చ‌ర‌ణ్ రంగ‌స్థ‌లం కూడా స‌మ్మ‌ర్ లోనే రానుంది. సంక్రాంతికి రావాల‌నుకున్నా.. బాబాయ్ ప‌వ‌న్ కు అడ్డురావ‌డం ఇష్టం లేక స్వ‌యంగా త‌ప్పుకున్నాడు చ‌ర‌ణ్. ఈయ‌న సినిమా మార్చ్ 27న చ‌ర‌ణ్ పుట్టిన‌రోజు కానుక‌గా విడుద‌ల చేయాల‌నేది ద‌ర్శ‌క నిర్మాత‌ల ఆలోచ‌న‌. మొత్తానికి స‌మ్మ‌ర్ 2018 ఆర్నెళ్ల ముందే హౌజ్ ఫుల్ అయిపోయింది.