వారిపై మహేష్ ప్రశంసల జల్లు.. ఎందుకో తెలుసా..!

 

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తమ గురించి మాట్లాడితే బాగుంటుంది. తమ ఊరికి వస్తే ఇంకా బాగుంటుంది.  అలాగే తమ ఇంటికి వస్తే అబ్బో అంతకన్నా ఇంకేం కావాలి అనుకుంటూ ఉంటాం.  మహేష్ కు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు.  అయితే, అందరిని పలకరించడం కుదరదు.  వారు చేసిన మంచి పనిని ఖచ్చితంగా అభినందించి తీరతాడు మహేష్ బాబు.  అలాంటి ఉదాహరణలో ఒకటి ఇటీవల జరిగిన సంఘటనే. మహేష్ బాబు సొంత గ్రామమైన బుర్రిపాలెంలో మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. 11 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి అనేక రోగాలపై అవగాహనను, చికిత్సను, మందులను పంపిణి చేశారు.  ఈ విషయం మహేష్ బాబుకు తాజాగా తెలిసింది.
అంతే వైద్య శిబిరం ఏర్పాటు చేసిన వారిని ప్రశంసించారు.  ఈ విషయం తెలిసి తాను ఎంతో సంతోషించానని చెప్పడమే కాకుండా తన పేస్ బుక్ ద్వారా వారికి అభినందనలు తెలిపారు. మహేష్ బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే.  గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.  ముఖ్యంగా, రోడ్లు, డ్రైనేజ్ సమస్య, స్కూల్ ఇలా ఎన్నో సమస్యలకు పరిష్కారం కనుగొంటున్నారు. మహేష్ తమ ఊరిని దత్తత తీసుకోవడం ఆనందంగా ఉందని ఇప్పటికే పలుమార్లు గ్రామస్తులు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, రీసెంట్ గా మహేష్ పుట్టినరోజు సందర్బంగా లేటెస్ట్ మూవీ స్పైడర్ టీజర్ రిలీజైన విషయం కూడా తెలిసిందే. ఈ టీజర్ కు అన్నివైపుల నుంచీ అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో మహేష్ ఫుల్ ఖుషీ అయిపోయి అందరికీ థాంక్స్ కూడా చెప్పుకొచ్చాడు. ఇక ఇప్పుడు వైద్య శిబిరం ఏర్పాటు చేసిన వాళ్ళను కూడా అభినందించి సూపర్ స్టార్ కి సూపర్ మనసుందని చాటాడు.