మహేష్ బాబు హ్యాండ్ ఎందుకిచ్చాడో..?

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ఆ మధ్య ‘అ..ఆ.. ‘ సినిమాతో మంచి హిట్ అందుకుని ఇప్పుడు ‘లై’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోన్న విషయం తెలిసిందే.

అందాల రాక్షసి ఫేమ్ హను రాఘవపూడి తెరకెక్కించిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉండగా..

తాజాగా గ్రాండ్ గా జరిగిన లై ఆడియో లాంచ్ లాంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ తో సినిమాపై జనాల్లో మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ అయినట్లే కనిపిస్తోంది.

ఇదిలా ఉంటే, ఈ ఆడియో ఫంక్షన్ కు సూపర్ స్టార్ మహేష్ బాబు గెస్ట్ గా హాజరవుతారని మొదట్నుంచీ ప్రచారం జరిగిన విషయం తెలిసే ఉంటుంది.

ముందుగా నితిన్ ఈ ఆడియో ఫంక్షన్ కు తన అభిమాన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నే ముఖ్య అతిథిగా పిలవాలని అనుకున్నా.. అది ఎందుకో కుదరలేదు.

అందుకే లై సినిమాను నిర్మించిన 14 రీల్స్ ప్రొడ్యూసర్స్ మహేష్ తో ఉన్న ప్రత్యేక అనుబంధం కారణంగా ఆయనను ఇన్వైట్ చేసినట్లు తెలుస్తోంది.

దీంతో నితిన్ తరపున త్రివిక్రమ్ వస్తే.. నిర్మాతల తరపున మహేష్ బాబు చీఫ్ గెస్ట్ గా లై ఆడియో ఫంక్షన్ కు విచ్చేస్తాడని చాలామంది లెక్కలేసుకున్నారు.

కానీ, చివరకు మహేష్ రాకపోవడంతో.. గెస్ట్ లుగా వచ్చిన త్రివిక్రమ్ – సుకుమార్ చేతుల మీదుగానే లై ఆడియోను రిలీజ్ చేయించారు.

దీంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ కాస్త ఫీలైనట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో పవన్ రావడం లేదని ముందే తెలిసిపోవడంతో.. పవర్ స్టార్ ఫ్యాన్స్ సిట్యుయేషన్ ను అర్థం చేసుకున్నట్లే కనిపిస్తోంది. అయితే 14 రీల్స్ కారణంగా మహేష్ వస్తున్నాడని గట్టిగా ప్రచారం జరగడంతో.. అభిమానులు చాలానే ఆశలు పెట్టుకుని, ఆడియో ఫంక్షన్ కు వచ్చి నిరాశకు గురైనట్లు చెప్పుకుంటున్నారు.

మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు గాని, ప్రస్తుతం మాత్రం ఈ ఆడియో ఫంక్షన్ కు మహేష్ హ్యాండ్ ఇచ్చాడని మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. మరి ఈ విషయంలో అసలు ఎందుకు హ్యాండ్ ఇవ్వాల్సి వచ్చిందో మహేష్ కే తెలియాలి.

Follow US