ఖైదీకి  మ‌హేష్ ఫిదా

karthis-khaidi( Image Source: Google)

కార్తీ క‌థానాయ‌కుడిగా న‌టించిన ఖైదీ ఇటీవ‌ల విడుద‌లై తెలుగు, త‌మిళ్ లో పెద్ద విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. టాలీవుడ్ స‌హా తెలుగు ప్రేక్ష‌కులు ఖైదీ కి ఫిదా అయ్యారు. ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా సాగిన స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ మంచి  రివ్యూలు సైతం ద‌క్కాయి. సినిమా చూసిన ప్ర‌తీ ఒక్క‌రు గొప్ప సినిమా అంటూ ప్ర‌శంసించారు. తాజాగా సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు కూడా ఖైదీ మేకింగ్ కి ఫిదా అయ్యారు. సినిమా చూసి త‌న అనుభూతిని ట్విట‌ర్ వేదిక‌గా పంచుకున్నాడు.

థ్రిల్లింగ్ యాక్ష‌న్ స‌న్నివేశాలు ఆక‌ట్ట‌కున్నాయి. పాట‌లు లేకుండా తీసిన ఇది. లోకేష్ క‌న‌క‌రాజ్‌  మేకింగ్ లో  కొత్త పంథాని ప‌రిచ‌యం వేసారు. ఎంటైర్ టీమ్ కి శుభాకాంక్ష‌లు తెలిపాడు. ప్ర‌స్తుతం మహేష్ అనీల్  రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో `స‌రిలేరు నీకెవ్వ‌రు`లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే కొంత భాగం చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. భారీ అంచ‌నాల న‌డుమ చిత్రం సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.