మ‌హేష్ కోసం చ‌ర‌ణ్ ఎన్టీఆర్

Last Updated on by

బై వ‌న్ గెట్ వ‌న్ ఫ్రీలా ఉంది ఇప్పుడు చ‌ర‌ణ్- ఎన్టీఆర్ ను చూస్తుంటే. ఒక్క‌రిని పిలిస్తే ఇద్ద‌రూ వ‌స్తున్నారు ఇప్పుడు. ఈ ఇద్ద‌రూ క‌లిసి మ‌ల్టీస్టార‌ర్ చేయ‌బోతున్నారు. ఆ బాండింగ్ ఇప్ప‌ట్నుంచే బ‌ల‌ప‌డుతుంది. ఇప్ప‌టికే ఈ ఇద్ద‌రూ మంచి స్నేహితులు. ఇప్పుడు రాజ‌మౌళి పుణ్య‌మా అని అది ఇంకా బ‌ల‌ప‌డుతుంది.. బ‌య‌ట‌ప‌డుతుంది కూడా. ఇప్పుడు మ‌హేష్ కోసం ఈ ఇద్ద‌రు హీరోలు క‌దులుతున్నారు. భ‌ర‌త్ అనే నేను ప్రీ రిలీజ్ వేడుక హైద‌రాబాద్ లోనే ఏప్రిల్ 7న జ‌ర‌గ‌బోతుంది. దీనికి ముఖ్య అతిథులుగా రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్ ల‌ను ఆహ్వానిస్తున్నారు. ఇప్ప‌టికే చ‌ర‌ణ్ ద‌గ్గ‌రికి త‌నే స్వ‌యంగా వెళ్లింది మ‌హేష్ స‌తీమ‌ణి న‌మ్ర‌తా శిరోద్క‌ర్. వెళ్లి రంగ‌స్థ‌లం స‌క్సెస్ కు కంగ్రాట్స్ చెప్ప‌డ‌మే కాకుండా.. ప్ర‌త్యేకంగా భ‌ర‌త్ అనే నేను ప్రీ రిలీజ్ వేడుక‌కు ఆహ్వానించింది. దీనికి చ‌ర‌ణ్ కూడా వ‌స్తాన‌ని చెప్పాడు.

కొర‌టాల‌తో చ‌ర‌ణ్ త్వ‌ర‌లోనే సినిమా చేయ‌బోతున్నాడు. ఇక ఎన్టీఆర్ సైతం కొర‌టాల‌తో ప్ర‌త్యేక అనుబంధం ఉన్న వాడే. ఈయ‌న‌కు జ‌న‌తా గ్యారేజ్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ ఇచ్చాడు ఈ ద‌ర్శ‌కుడు. పైగా మ‌హేష్ బాబు అంటే ఎన్టీఆర్ కు ప్ర‌త్యేక అభిమానం. ఇత‌న్ని కూడా న‌మ్ర‌తే ప్ర‌త్యేకంగా ఆహ్వానించింది. ఈ ఇద్ద‌రు హీరోలు భ‌ర‌త్ అనే నేను ప్రీ రిలీజ్ వేడుక‌కు రానున్నారు. మ‌హేష్ తో పాటు ఒకే స్టేజ్ ని పంచుకోబోతున్నారు. ఈ అద్భుత‌మైన దృశ్యం ఏప్రిల్ 7న అభిమానుల ముందుకు రానుంది. ఏప్రిల్ 20న సినిమా విడుద‌ల కానుంది.

User Comments