నా పేరు భ‌ర‌త్.. ఇవే నా రికార్డులు

Last Updated on by

నా పేరు సూర్య ఉంది కానీ నా పేరు భ‌రత్ ఏంటి అనుకుంటున్నారా..? ఇప్పుడు మ‌హేష్ చేసిన సినిమా ఉంది క‌దా.. అదే భ‌ర‌త్ అనే నేను. దీన్నే మ‌న సౌక‌ర్యం కోసం కాస్త మార్చేసాం అంతే. భ‌ర‌త్ అనే నేను కాస్తా.. నా పేరు భ‌ర‌త్ అయిపోయింది. ఈ చిత్ర విజ‌న్ విడుద‌లైంది. విడుద‌లైన కొన్ని గంట‌ల్లోనే రికార్డ్ వ్యూస్ సాధించింది. కేవ‌లం 5 గంట‌ల్లోనే 30 ల‌క్ష‌ల డిజిట‌ల్ వ్యూస్ తో పాటు యూ ట్యూబ్ లో 17 ల‌క్ష‌ల వ్యూస్ అందుకుంది ఈ చిత్ర టీజ‌ర్. ఇక లైకులు కూడా 2 లక్ష‌ల‌కు పైగా వ‌చ్చాయి. తెలుగులో ఇంత వేగంగా 2 ల‌క్ష‌ల లైకులు అందుకున్న టీజ‌ర్ మ‌రేది లేదు. ఇప్పటి వరకు అంటే 24 గంటలు కూడా గడువనే లేదు అప్పుడే 75 లక్షల మంది చూసారు.

అజ్ఞాత‌వాసి టీజ‌ర్ కు కూడా ఈ స్థాయి రెస్పాన్స్ రాలేదు. లైకుల ప‌రంగా భ‌ర‌త్ అనే నేను కొత్త రికార్డుల‌కు తెర‌తీసాడు. ఇక వ్యూస్ లో మాత్రం కాస్త వెన‌కాలే ఉన్నాడు సూప‌ర్ స్టార్. అయితే రానురాను టీజ‌ర్ వ్యూస్ మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంది. ఈ చిత్ర టీజ‌ర్ కు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌స్తుంది. చూస్తే మ‌రో శ్రీ‌మంతుడు కావ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. కాక‌పోతే ఈ సారి ద‌త్త‌త కాస్త పెద్ద‌దిగా ఉంది.. అంటే అప్పుడు ఊరు ఇప్పుడు రాష్ట్రం అన్న‌మాట‌. అంతే తేడా..! న‌మ్మిన ప్ర‌జ‌ల కోసం ఏదైనా చేసే రాజ‌కీయ నాయ‌కుడిగా ఇందులో న‌టిస్తున్నాడు మ‌హేష్ బాబు. మ‌రి మ‌నోడి పాలిటిక్స్ ఎలా ఉండ‌బోతున్నాయో చూడాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

User Comments