ఆ ముగ్గురికి మహేష్ రాయ‌బారం

Last Updated on by

మహేష్ కు రాయ‌బారం చేయాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింది.. ఆయ‌న సూప‌ర్ స్టార్ క‌దా అనుకుంటున్నారా..? ఎంత పెద్ద సూప‌ర్ స్టార్ అయినా కూడా కొన్నిసార్లు ఇలాంటి ప‌రిస్థితులు రాక‌మాన‌వు ఇండ‌స్ట్రీలో. ఇప్పుడు ఈయ‌న చేస్తోన్న వంశీ పైడిప‌ల్లి సినిమాకే మహేష్ రాయ‌బారిగా మారాల్సి వ‌చ్చింది. ఈ చిత్రాన్ని ముందు పివిపి నిర్మించాలి. వంశీ పైడిప‌ల్లి అప్ప‌టికే ఊపిరి సినిమాను ఇదే సంస్థ‌లో చేసాడు కూడా. అదే న‌మ్మ‌కంతో మహేష్ సినిమాను కూడా వంశీకే ఇచ్చాడు పివిపి. మ‌రోవైపు బ్ర‌హ్మోత్స‌వం ఫ్లాప్ త‌ర్వాత మహేష్ కూడా ఈ నిర్మాత‌కు మ‌రో సినిమా చేస్తాన‌ని చెప్పాడు.

ఆ క్ర‌మంలోనే వంశీ పైడిప‌ల్లి సినిమాపై 4 కోట్ల వ‌ర‌కు ఖ‌ర్చు కూడా చేసాడు. స్టోరీ సిట్టింగ్స్ అనీ.. అదనీ ఇద‌నీ కొన్ని కోట్లు ఖ‌ర్చ‌య్యాయి. కానీ ఆ త‌ర్వాత స‌డ‌న్ గా పివిపిని కాద‌ని.. వంశీ పైడిప‌ల్లి త‌న ఆస్థాన నిర్మాత దిల్ రాజు ద‌గ్గ‌రికి వ‌చ్చాడు. అందులో అశ్వినీదత్ కూడా పార్ట్ న‌ర్ అయ్యాడు. ఇదంతా చూసిన పివిపి ముందు వంశీని నిల‌దీసినా ఏం ప్ర‌యోజ‌నం లేకుండా పోయింది. ఆ త‌ర్వాత ఆయ‌న చెన్నై కోర్ట్ లో కేస్ వేయ‌డానికి కూడా సిద్ధ‌మ‌య్యాడు.. వేసాడు కూడా. అయితే ఇదంతా ర‌చ్చ జ‌రిగితే చివ‌రికి త‌న సినిమాకు న‌ష్టం అని తెలుసుకున్న మహేష్.. ఈ ముగ్గురు నిర్మాత‌ల మ‌ధ్య స‌యోధ్య‌ను కుదిర్చాడ‌ని తెలుస్తుంది. క‌లిసుంటే క‌ల‌దు సుఖం అంటూ పాట‌లు పాడి అంద‌ర్నీ ఒకే గూటికి చేర్చాడ‌ని తెలుస్తుంది. ఇప్పుడు వంశీ సినిమాలో పివిపి కూడా భాగస్వామిగా మారాడు. మొత్తానికి మహేష్ రాయ‌బారంతో పివిపి కూడా ఇప్పుడు కాంప్ర‌మైజ్ అయ్యాడు.

User Comments