మహేష్ విజ‌న్ కోసం వెయిటింగ్

Last Updated on by

టీజ‌ర్.. ట్రైల‌ర్.. ఇవ‌న్నీ కామ‌న్. ఈ ప‌దాలు కొన్నేళ్లుగా మ‌నం వింటూనే ఉన్నాం. టీజ‌ర్ అంటే చిన్న విజువ‌ల్.. ట్రైల‌ర్ అంటే డైలాగుల‌తో ర‌చ్చ అని అర్థ‌మైపోయింది. కానీ మ‌న ద‌ర్శ‌కులు ఇంకా కొత్త‌ద‌నం కోరుకుంటున్నారు. టీజ‌ర్లు.. ట్రైల‌ర్ కాకుండా ఇంకేదో విడుద‌ల చేయాల‌ని చూస్తున్నారు. చేసే వాటికి కొత్త పేర్లు పెడుతున్నారు. మొన్న‌టికి మొన్న పైసావ‌సూల్ కోసం స్టంప‌ర్ అన్నాడు పూరీ జ‌గ‌న్నాథ్. టీజ‌ర్.. ట్రైల‌ర్ కు మ‌ధ్య‌లో ఉంటుంది అది. ఇక బ‌న్నీ కూడా టీజ‌ర్ కాకుండా నా పేరు సూర్య‌కు ఇంపాక్ట్ అన్నాడు. అలా ఎందుక‌న్నాడో అది చూసిన త‌ర్వాత అర్థ‌మ‌వుతుంది. మహేష్ బాబు కూడా ఓత్ అన్నాడు. దానికి కార‌ణం లేక‌పోలేదు.Mahesh Babu fans waiting for vision of Bharath ane Nenuఇది రాజ‌కీయ నేప‌థ్యంలో తెర‌కెక్కే సినిమా కాబ‌ట్టి ఓత్ అన్నాడు. అంటే ప్ర‌మాణం అని అర్థం. ఇప్ప‌టికే ఫ‌స్ట్ ఓత్ వ‌చ్చేసింది.. ఇప్పుడు రెండో టీజ‌ర్ కు స‌మ‌యం స‌న్న‌ద్ధ‌మైంది. దానికి విజ‌న్ అని పేరు పెట్టాడు. ఎందుకంటే రాజ‌కీయాల్లో విజ‌న్ అనే ప‌దాన్ని ఎక్కువ‌గా వాడుతుంటారు. అందుకే ఆడియోకు ఓత్ అన్నాడు.. ఇప్పుడేమో విజ‌న్ అంటున్నాడు. మార్చ్ 6న భ‌ర‌త్ అనే నేను టీజ‌ర్ విడుద‌ల కానుంది. ఇప్ప‌టికే ఈ చిత్ర షూటింగ్ చివ‌రిద‌శ‌కు వ‌చ్చేసింది. మార్చ్ 8 నాటికి షూటింగ్ అంతా పూర్తి చేయాల‌ని చూస్తున్నాడు కొర‌టాల శివ‌. ఇదే నెల‌లో ఆడియో కూడా ప్లాన్ చేస్తున్నారు. సినిమా ఏప్రిల్ 20న విడుద‌ల కానుంది. డివివి దాన‌య్య నిర్మిస్తోన్న ఈ చిత్రంలో కైరా అద్వాని హీరోయిన్. మొత్తానికి.. ఓత్ అయితే అదిరిపోయింది.. మ‌రి విజ‌న్ ఎలా ఉండ‌బోతుందో..?

User Comments