చ‌ర‌ణ్ స్థానంలో మ‌హేష్ న‌టిస్తాడా?

ఎవ‌రూ ఊహించ‌ని క‌ల‌యిక ఇది. ఇదే నిజ‌మ‌యితే ఒక సంచల‌న‌మే. దీని గురించే నిన్న‌టి నుంచి ఇండ‌స్ట్రీలో జోరుగా చ‌ర్చ సాగుతోంది. చిరంజీవితో మ‌హేష్ క‌లిసి న‌టిస్తాడ‌న్న విష‌య‌మే ఆ చ‌ర్చ‌కి కార‌ణం. మ‌రి ఇది నిజ‌మా కాదా ? సాధ్య‌మ‌య్యే సంగ‌తేనా అన్న‌ది తెలియాలంటే మ‌రికొన్నాళ్ల‌వ‌ర‌కు ఆగాల్సిందే.అయితే ప్ర‌స్తుతానికి ఈ కాంబోనే హాట్ టాపిక్‌గా మారింది. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో చిరంజీవి క‌థానాయ‌కుడిగా `ఆచార్య‌` తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో రామ్‌చ‌ర‌ణ్ కూడా ఓ కీల‌క పాత్ర‌లో న‌టించాల్సి ఉంది. అయితే ఆయ‌న స్థానంలో మ‌హేష్‌ని ఎంపిక చేశార‌ని, ఆయ‌న కూడా ఓకే చెప్పార‌ని ప్ర‌చారం సాగుతోంది.

`ఆర్‌.ఆర్‌.ఆర్` చిత్రీక‌ర‌ణ‌లో జాప్యం జ‌రుగుతుండ‌డంతోనే చ‌ర‌ణ్ స్థానాన్ని మ‌హేష్‌తో రిప్లేస్ చేస్తార‌ట‌. అదే నిజ‌మైతే నిజంగా ఇదొక సంచ‌న‌ల క‌ల‌యిక అవుతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. కానీ అధికారికంగా మాత్రం ఈ విష‌యాన్ని ఎవ్వ‌రూ బ‌య‌ట‌పెట్ట‌డం లేదు. దీనిపై సందేహాలు కూడా ఉన్నాయి. చిరు సినిమాలో చ‌ర‌ణ్ చేయ‌బోయే పాత్ర ఫ్లాష్‌బ్యాక్‌లో వ‌చ్చేది. అది యంగ్ చిరంజీవి పాత్ర అట‌. అందులో చ‌ర‌ణ్ న‌టిస్తేనే బాగుంటుంద‌ని భావించి ఆయ‌న‌కోస‌మే సృష్టించాడు కొర‌టాల శివ‌. మ‌రి అలాంటి పాత్ర కోసం మ‌హేష్‌ని ఎలా ఎంపిక చేసుకుంటారు .అందుకే ఇది నిజం కాద‌నేది కొన్ని వ‌ర్గాల మాట‌. మ‌రో కొత్త విష‌య‌మేమిటంటే చ‌ర‌ణ్‌తోపాటు సినిమాలో మ‌హేష్ కూడా క‌నిపిస్తాడ‌ని, ఆయ‌న కేవ‌లం ఒక అతిథి పాత్ర‌లో న‌టిస్తాడ‌ని… కొర‌టాల శివ‌, చిరంజీవిల‌తో ఉన్న సాన్నిహిత్యం మేర‌కు మ‌హేష్ ఒప్పుకున్నాడ‌ని చెప్పుకుంటున్నారు. మ‌రి ఏది నిజం అనేది తెలియాలంటే మాత్రం కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.