మ‌హేష్ మ‌ల్టీప్లెక్స్ ఇదిగో ఇదే

టాలీవుడ్ స్టార్లు మ‌ల్టీప్లెక్స్ వ్యాపారాల‌తో బిజీ అవుతున్నార‌న్న స‌మాచారం ఉంది. ఇప్ప‌టికే ఈ రంగంలో ప‌లువురు స్టార్లు, ద‌ర్శ‌కనిర్మాత‌లు పాగా వేసిన సంగ‌తి తెలిసిందే. ఇదివ‌ర‌కూ ప్ర‌భాస్ – చ‌ర‌ణ్ కాంబో మ‌ల్టీప్లెక్స్ వ్యాపారానికి ప్లాన్ చేస్తున్నార‌ని ప్ర‌చార‌మైంది. అలానే సూప‌ర్‌స్టార్ మ‌హేష్ ఈ రంగంలో అడుగుపెడుతున్నార‌న్న ప్ర‌చారం ఇటీవ‌ల సాగింది.

మ‌హేష్ మిగ‌తావాళ్ల‌లా లేట్ చేయ‌లేదు. అనుకున్న‌దే త‌డ‌వుగా ప‌ని మొద‌లెట్టాడు. హైదరాబాద్ గచ్చిబౌలిలో ఓ భారీ మ‌ల్టీప్లెక్స్ నిర్మాణం సాగుతోంది. దీని పేరు AMB సినిమాస్. ఈ మ‌ల్టీప్లెక్స్ చైన్ వ్యాపారాన్ని మ‌హేష్ ఎవ‌రితో క‌లిసి చేస్తున్నారో తెలుసా? మ‌ల్టీప్లెక్స్ రంగంలో ఇప్ప‌టికే వేళ్లూనుకున్న ఏషియ‌న్ సినిమా అధినేత‌ సునీల్ నారంగ్ లాంటి దిగ్గ‌జంతో క‌లిసి ఈ కొత్త బిజినెస్‌లో దిగారు. తొలిగా గచ్చిబౌలి నుండి కొత్తగూడ క్రాస్ రోడ్ కు వచ్చేదారిలో మెయిన్ రోడ్ పై ఇప్ప‌టికే నిర్మాణం సాగుతోంది. అక్క‌డ ఓ భారీ మాల్‌లో ఈ మ‌ల్టీప్లెక్స్ ఉందిట‌. అల్ట్రా మోడ్ర‌న్ ఫెసిలిటీస్‌తో ఈ మ‌ల్టీప్లెక్స్ దుమ్ము దులిపేస్తుందిట‌. వ‌చ్చే ఏడాది రిబ్బ‌న్ క‌టింగ్ చేస్తార‌ని తెలుస్తోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో బిలియ‌న్ డాల‌ర్ మ‌ల్టీప్లెక్స్ బిజినెస్‌కి ప‌లువురితో టై అప్‌లు ఉంటాయ‌ని తెలుస్తోంది.

User Comments