ఉగాదికి పోటీ పడుతున్న స్టార్ హీరోలు

Last Updated on by

తెలుగు సంవ‌త్స‌రాదికి ఏం చేసినా శుభంగా ఉంటుంద‌ని తెలుగు వాళ్ల న‌మ్మ‌కం. అందుకే మ‌న ఇండ‌స్ట్రీలోనూ చాలా సినిమాల‌కు ముహూర్తాలు.. విడుద‌ల‌.. ఆడియో విడుద‌ల లాంటి కార్య‌క్ర‌మాలు చేస్తుంటారు. అంతెందుకు మార్చ్ 18న నాని-నాగార్జున సినిమా ప‌ట్టాలెక్క‌నుంది.. ఉగాది ఉంది కాబ‌ట్టే అదేరోజు రామ్ చ‌ర‌ణ్ రంగ‌స్థ‌లం ప్రీ రిలీజ్ వేడుక కూడా జ‌ర‌గ‌బోతుంది. ఇప్పుడు మ‌హేష్ కూడా ఉగాదిని వాడుకుంటున్నాడు. ఇందులోని తొలి పాట‌ను ఉగాది కానుక‌గ విడుద‌ల చేయాల‌ని చూస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ప్ర‌స్తుతం ఈ పాట‌ను కైరాఅద్వానీ, మ‌హేష్ పై చిత్రీక‌రిస్తున్నాడు ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌. మ‌రో రెండు రోజుల్లో పాట పూర్తి కానుంది. షూటింగ్ కూడా ఇదే నెల‌లో పూర్తి కానుంది.

దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తోన్న భ‌ర‌త్ అనే నేను ఆడియోపై అంచ‌నాలు తారాస్థాయిలో ఉన్నాయి. రంగ‌స్థ‌లం పాట‌ల‌తో ఇప్ప‌టికే ర‌చ్చ చేస్తున్న దేవీ.. భ‌ర‌త్ అనే నేనుకు ఏం చేస్తాడో అని ఆస‌క్తిగా చూస్తున్నారు ప్రేక్ష‌కులు. ఏప్రిల్ 20న భ‌ర‌త్ అనే నేను విడుద‌ల కానుంది. ఇప్ప‌టికే విడుద‌లైన విజ‌న్ కు అద్భుతమైన స్పంద‌న వ‌స్తుంది. ఏప్రిల్ 8న ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక జ‌ర‌గ‌బోతుంది. మొత్తానికి.. ఫ‌స్ట్ సింగిల్ తో భ‌ర‌త్ ఉగాదికి ఏం మాయ చేయ‌బోతున్నాడో..!

User Comments