మ‌హేష్ గుట్టు విప్పేది అప్పుడే?

Last Updated on by

`మ‌హ‌ర్షి` త‌ర్వాత మ‌హేష్ బాబు ఏ ద‌ర్శ‌కుడితో సినిమా చేస్తాడ‌న్న దానిపై స‌ర్వత్రా ఆస‌క్తి నెల‌కొంది. సుకుమార్ బ‌న్నీకి ఫిక్స్ అయ్యాడు. సందీప్ వంగా బాలీవుడ్ లో బిజీ… మ‌హేష్ కోసం ఇంకా క‌థ సిద్దం చేసింది లేదు. `కేజీయ‌ఫ్` డైరెక్ట‌ర్ తో క‌మిట్ మెంట్ ఉన్నా! అది సెట్స్ వెళ్లేది 2021లోనే. స్టార్ డైరెక్ట‌ర్లు అంతా బిజీ. `ఎఫ్ -2` తో బ్లాక్ బ‌స్ట‌ర్ ఇచ్చిన అనీల్ రావిపూడితో సినిమా ఉంటుంద‌ని బ‌ల‌మైన ప్ర‌చారం సాగుతోంది. కానీ అందులో వాస్త‌వం ఎంత‌న్న‌ది తేల‌లేదు. అటు మ‌హేష్ గానీ, అనీల్ గాని దీనిపై ఎక్క‌డా మాట్లాడింది లేదు. కేవ‌లం ఉహాగానాలు మాత్ర‌మే వ‌స్తున్నాయి. పైగా అనీల్ కు క‌థ‌ల‌కు మ‌హేష్ అంత ఈజీగా క‌న్వెన్స్ అవుతాడా? అన్న‌ది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌.

ఈ నేప‌థ్యంలోనే ఆ కాంబినేష‌న్ లో సినిమా ఉంటుందా? ఉండ‌దా? అన్న‌ది ఓ డైల‌మా. సాధార‌ణంగా ఒక సినిమా సెట్స్ లో ఉండ‌గానే మ‌రో క‌మిట్ మెంట్ తో రెడీగా ఉంటారు. కానీ ఈసారి మ‌హేష్ విష‌యంలో ఊహించ‌ని ప‌రిస్థితులు త‌లెత్తాయి. అందువ‌ల్లే మ‌హేష్ స్థ‌బ్దుగా ఉండాల్సి వ‌చ్చింద‌న్న మాట మాత్రం వాస్త‌వం. మ‌రి వీట‌న్నింటికి చెక్ పెట్టేది ఎప్పుడంటే? మ‌హేష్ స‌న్నిహిత వ‌ర్గాల నుంచి ఆస‌క్తిక‌ర విష‌యాలు వినిపిస్తున్నాయి. `మ‌హ‌ర్షి` మే లో రిలీజ్ అయిన అనంత‌రం మ‌హేష్ మూడు నెల‌లు గ్యాప్ తీసుకుంటాడుట‌.

న‌మ్ర‌త రిలేష‌న్స్ లో ఓ పెళ్లికి మ‌హేష్ హాజ‌రుకానున్నాడుట‌. అనంత‌రం ఫ్యామిలీతో ప్రాన్స్ ట్రిప్ ఉంటుందట‌. దాదాపు రెండు నెల‌లు పాటు అక్క‌డే ఉంటాడ‌ని స‌మాచారం. అదే స‌మ‌యంలో త‌న బిజినెస్ ల‌కు సంబంధించి ఓ కార్పో రేట్ సంస్థ‌తో భేటి కానున్నాడుట‌. ఎంత లేద‌న్నా ఈ ప‌నులు పూర్త‌వ్వ‌డానికి మూడు నెల‌లు స‌మ‌యం ప‌డుతుంద‌ని అంటున్నారు. అనంత‌రం మ‌హేష్ 26వ‌సినిమా ఓ స్ప‌ష్ట‌మైన‌ ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.