సౌత్ ఇండియాలో మ‌హేష్ నంబర్ వన్

Last Updated on by

మ‌హేష్ బాబు.. తెలుగు ఇండ‌స్ట్రీ సూప‌ర్ స్టార్. ఇందులో ఎవ‌రికీ ఎలాంటి అనుమానాలు లేవు. ఆయ‌న జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేదు. దానికి మించిన ఇమేజ్ మ‌హేష్ సొంతం. అదే ఇప్పుడు ఆయ‌న‌కు కాసులు కురిపిస్తుంది. శ్రీ‌మంతున్ని చేస్తుంది. సినిమాల కంటే కూడా యాడ్స్ తోనే ఎక్కువ‌గా సంపాదిస్తున్నాడు సూప‌ర్ స్టార్. యాడ్స్ రంగంలో సౌత్ ఇండియాలో మ‌హేష్ కంటే తోపు ఎవ‌రూ లేరు. ఎండోర్స్ మెంట్ చేయ‌డంలో మ‌హేష్ ఆరితేరిపోయాడు. ఏడేళ్లుగా ఈయ‌న యాడ్ రంగాన్ని దున్నేస్తున్నాడు. తెలుగులో మ‌రే హీరో క‌నీసం మ‌హేష్ కు చేరువ‌గా కూడా రాలేక‌పోతున్నాడు.

బ‌న్నీ, చ‌ర‌ణ్, ఎన్టీఆర్ లాంటి వాళ్లు కూడా అప్పుడ‌ప్పుడూ యాడ్స్ చేస్తున్నా.. మ‌హేష్ ముందు వాళ్లంతా దిగ‌దుడుపే. కేవ‌లం యాడ్స్ నుంచే ఏడాదికి దాదాపుగా 20 కోట్ల‌కు పైగానే సంపాదిస్తున్నాడు మ‌హేష్. ఇప్పుడు ఈయ‌న ఖాతాలో మ‌రో యాడ్ కూడా చేరిపోయింది. ప్రొటీన్ కంపెనీ ప్రొటినెక్స్ త‌మ‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా ఎంచుకుంది. సౌత్ ఇండియాలో త‌మ ప్రాడ‌క్ట్ ను మ‌హేష్ కంటే ఎవ‌రూ బాగా ప్ర‌మోట్ చేయ‌లేర‌ని.. ఆయ‌న త‌ప్ప త‌మ‌కు మ‌రో ఆప్ష‌న్ కూడా క‌నిపించ‌లేదంటున్నారు ప్రొటినెక్స్ కంపెనీ. మొత్తానికి మ‌హేష్ దూకుడు చూస్తుంటే ఇప్పుడు సినిమాల కంటే కూడా యాడ్స్ పైనే ఎక్కువ దృష్టి పెట్టిన‌ట్లుగా క‌నిపిస్తుంది. మ‌రి ఫ్లాపుల్లో ఉంటేనే ప‌రిస్థితి ఇలా ఉంది.. రేపు భ‌ర‌త్ అనే నేను సూప‌ర్ హిట్ అయితే మ‌నోడి ఇమేజ్ మ‌ళ్లీ అమాంతం ఆకాశానికి చేరిపోతుందేమో..?

User Comments