మ‌హేష్ 6-ప్యాక్ లుక్‌

Last Updated on by

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌ని ఈసారి పూర్తిగా కొత్త రూపంలో చూడ‌బోతున్నాం. అత‌డిని 16ఏళ్ల కాలేజ్ బోయ్‌గా తెర‌పై వీక్షించ‌బోతున్నాం. ఆ మేర‌కు అత‌డు ఫిజిక‌ల్‌గా రూపం మార్చుకుంటున్నారు. అంతేకాదు ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో అత‌డు ఈసారి చొక్కా విప్పి 6ప్యాక్‌ని చూపిస్తాడ‌ని తెలుస్తోంది. అయితే ఇది ఏ సినిమా కోసం అంటే.. త‌న కెరీర్ ల్యాండ్ మార్క్ మూవీ (25వ చిత్రం) కోస‌మేన‌ట‌. ప్ర‌స్తుతం వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ఇందులో మ‌హేష్ కాలేజ్ విద్యార్థిగా క‌నిపించ‌నున్నాడు. అలానే వేరొక విభిన్న‌మైన రూపంలోనూ క‌నిపిస్తాడ‌ని తెలుస్తోంది.

ఇటీవ‌లే విమానాశ్ర‌యంలో గుబురుగ‌డ్డం, మీస‌క‌ట్టుతో కొత్త‌గా క‌నిపించేప్ప‌టికి అభిమానుల్లో ఒక‌టే ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది. ఇక‌పై 6ప్యాక్‌లో క‌నిపిస్తాడు అన‌గానే ఆ క్యూరియాసిటీ మ‌రింత రెయిజ్ అవుతోంది. 1నేనొక్క‌డినే టైమ్ నుంచి మ‌హేష్ 6ప్యాక్ చేస్తున్నార‌న్న ప్ర‌చారం ఉన్నా, ఇప్ప‌టివ‌ర‌కూ అత‌డు ష‌ర్ట్ విప్పింది లేదు. 6ప్యాక్ చూపించింది లేదు. శ్రీ‌మంతుడు, స్పైడ‌ర్‌, భ‌ర‌త్ అనే నేను వంటి చిత్రాలు రిలీజైనా ఎక్క‌డా చొక్కా విప్పే ఫీట్ లేనేలేదు. మొత్తానికి వంశీ పైడిప‌ల్లి అత‌డి చేత ఆ ఫీట్ వేయించ‌నున్నాడు. తార‌క్‌, చ‌ర‌ణ్‌, నితిన్ వంటి హీరోలు చొక్కా విప్పి 6ప్యాక్‌లు చూపించినా ఎందుక‌నో ఆ ఫీట్‌కి మ‌హేష్ దూర‌మైపోయాడు. కానీ 43 వ‌య‌సులో ఈ ఫీట్ వేసేందుకు అత‌డు చేస్తున్న సాహ‌సాన్ని మెచ్చాల్సిందే.

User Comments