స్పైడ‌ర్ తమిళ్ ప్రీమియ‌ర్స్ రచ్చ

మొన్నేక‌దా స్పైడ‌ర్ సినిమాను టీవీల్లో వేసింది.. అప్పుడే ఇంకోసారి వేస్తున్నారా అనుకుంటున్నారా..? అవును.. ఈ సినిమాను మ‌ళ్లీ అప్పుడే టీవీల్లో వేస్తున్నారు. అది కూడా ఈ ఆదివార‌మే.. సాయంత్రం 6.30కి. అంటే ఫిబ్ర‌వ‌రి 18 అన్న‌మాట‌. కాక‌పోతే తెలుగులో కాదులెండి.. ఇప్ప‌టికే మ‌న ప్రేక్ష‌కుల‌కు స్పైడ‌ర్ ద‌ర్శ‌నం అయిపోయింది కాబ‌ట్టి ఇప్పుడు త‌మిళ‌వాళ్ల‌కు ఆ ద‌ర్శ‌న‌భాగ్యం క‌లిగించ‌బోతున్నాడు సూప‌ర్ స్టార్. ఈ చిత్రాన్ని మురుగ‌దాస్ తెర‌కెక్కించాడు.

రెండు భాష‌ల్లోనూ స్పైడ‌ర్ డిజాస్ట‌రే. కాక‌పోతే క్రేజీ కాంబినేష‌న్ కాబ‌ట్టి భారీ రేట్ ఇచ్చి మ‌రీ స్పైడ‌ర్ హ‌క్కులు తీసుకున్నారు స‌న్ నెట్ వ‌ర్క్. విడుద‌లైన ఐదు నెల‌ల త‌ర్వాత తొలిసారి స‌న్ టీవీ స్పైడ‌ర్ ప్రీమియ‌ర్ వేస్తుంది. దానికోసం ఇప్ప‌టికే త‌మిళ స‌న్ నెట్ వ‌ర్క్ లో స్పైడ‌ర్ ప్రీమియ‌ర్ అంటూ ప్ర‌మోష‌న్ దంచేస్తుంది. అన్న‌ట్లు తెలుగులో మొన్న సంక్రాంతికి ముందు వేసిన టీవీ ప్రీమియ‌ర్ కు పెద్ద‌గా రెస్పాన్స్ అయితే రాలేదు. మ‌రిప్పుడు రాష్ట్రం కాని రాష్ట్రంలో మ‌హేష్ టీవీ ప్రేక్షకులను ఎంత వరకు మెప్పిస్తాడో..!

User Comments