మ‌హేష్ లో ఈ మార్పు మంచిదే

ఇప్పుడు అభిమానుల‌తో పాటు ప్రేక్ష‌కులు కూడా ఇదే ఫీల్ అవుతున్నారు. అస‌లు ఏసీ వ‌దిలేసి బ‌య‌టికి కూడా రాని మ‌హేష్ బాబు.. ఇప్పుడు మాత్రం ఎండ‌ల్లోనూ తిరిగేస్తున్నాడు. మాడు ప‌గులుతున్నా కూడా కాళ్ళు అరిగేలా తిరిగేస్తున్నాడు సూప‌ర్ స్టార్. అస‌లు మ‌హేష్ లో వ‌చ్చిన ఈ మార్పును చూసి అంతా షాక్ అవుతున్నారు. అస‌లేంటి మ‌హేష్ ఇలా తిరుగుతున్నాడు.. ఈయ‌న బ‌య‌టికి రావ‌డ‌మే గ‌గ‌నం అనుకుంటే.. ఏకంగా ప్ర‌మోష‌న‌ల్ టూర్ చేస్తున్నాడేంటి అనుకుంటున్నారు. భ‌ర‌త్ అనే నేను కోసం ప్రాణం పెట్టేస్తున్నాడు ఈ హీరో.Mahesh Babu Started Bharath Ane Nenu Promotion Tourఓపెనింగ్స్ లో ఇర‌గ‌దీసిన ఈ చిత్రం త‌ర్వాత కాస్త స్లో అయింది. దాంతో ప‌డిపోతున్న సినిమాను నిల‌బెట్ట‌డానికి హీరోను వెంట పెట్టుకుని బ‌య‌ల్దేరాడు కొర‌టాల శివ‌. ద‌ర్శ‌కుడిపై ఉన్న న‌మ్మ‌క‌మో ప్రేమో తెలియ‌దు కానీ కెరీర్ లోనే తొలిసారి పూర్తిస్థాయి ప్ర‌మోష‌న‌ల్ టూర్ చేస్తున్నాడు మ‌హేష్.Mahesh Babu Started Bharath Ane Nenu Promotion Tourసాధార‌ణ వ్య‌క్తిగా అంద‌రిలో క‌లిసిపోతున్నాడు. థియేట‌ర్ కి వెళ్లి అభిమానుల‌ను క‌లుసుకుంటున్నాడు. ఈయ‌న మార్పు చూసి స్టార్ హీరోలు కూడా షాక్ అవుతున్నారు. ఒక్క విజ‌యం ఈయ‌న‌లో ఇంత మార్పు తీసుకొచ్చిందా అనుకుంటున్నారు. ఇదంతా కొర‌టాల క్రెడిట్టా లేదంటే మ‌హేష్ త‌నంత‌ట తానే మారిపోయాడా అనిపిస్తుంది. ప‌నిలో ప‌నిగా త‌న విజ‌యోత్స‌వాన్ని బావ గ‌ల్లా జ‌య‌దేవ్ తో క‌లిసి చేస్తున్నాడు సూప‌ర్ స్టార్. ఆయ‌న‌కు రాజ‌కీయంగా కూడా మైలేజ్ అవుతుంది.Mahesh Babu Started Bharath Ane Nenu Promotion Tourవిజ‌య‌వాడ‌లో గ‌ల్లా ఫ్యామిలీతోనూ క‌లిసిపోయి వాళ్ల‌తో హాయిగా కాసేపు గ‌డిపాడు సూప‌ర్ స్టార్. మొత్తానికి ఈయ‌న‌లో వ‌చ్చిన మార్పు ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు కూడా ఖుషీ నింపేస్తుందిప్పుడు. రెండో వారంలో కూడా ఇదే దూకుడు చూపిస్తే తెలుగులో రంగ‌స్థ‌లం, ఖైదీ (నాన్ బాహుబ‌లి) త‌ర్వాత మూడో 100 కోట్ల షేర్ సాధించిన సినిమాగా భ‌ర‌త్ సంచ‌లనం సృష్టిస్తాడు.