రూ. 200 కోట్లతో షాక్ ఇస్తోన్న స్పైడర్..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు – సౌత్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ కాంబినేషన్లో తొలిసారి తెరకెక్కుతోన్న ‘స్పైడర్‘ మూవీపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో అందరికీ తెలుసు. ఆ అంచనాలను అందుకోవడం ఇప్పుడు స్పైడర్ కు కూడా పెద్ద కష్టంగా ఏం కనిపించడం లేదు. ఇప్పటికే రిలీజైన స్మాల్ టీజర్, వర్కింగ్ స్టిల్స్, నిర్మాణ విలువలతోనే సినిమా ఏ లెవెల్ లో ఉంటుందో చెప్పేయొచ్చు. అందుకే ఇప్పుడు సినిమా రేంజ్ ట్రేడ్ వర్గాలకు కూడా షాక్ ఇస్తోంది. మొదట రూ.100 కోట్ల స్పైడర్ బడ్జెట్ కాస్తా 130 కోట్లకు చేరితే.. 150 కోట్ల రూపాయల టార్గెట్ కష్టమేమో అనే అభిప్రాయం కూడా వ్యక్తమైన విషయం గుర్తుండే ఉంటుంది. కానీ ఇప్పుడేమో ఏకంగా సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ పేరుతో సునాయాసంగా 200 కోట్ల రూపాయల మార్క్ ను టచ్ చేయడం స్వీట్ షాకింగ్ గా మారింది.

ఈ మేరకు స్పైడర్ తెలుగు వెర్షన్ మాత్రమే థియేట్రికల్ హక్కుల ద్వారా రూ.90 కోట్లు తెచ్చుకుంటే.. తమిళ వెర్షన్ 23 కోట్ల రూపాయలకు ఫైనల్ చేసుకుంది. అలాగే అన్ని భాషలకు కలుపుకుని స్పైడర్ శాటిలైట్ రైట్స్ ద్వారా రూ.26 కోట్లు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇవి కాకుండా ఇప్పుడు హిందీ, మలయాళం వెర్షన్లు కలుపుకుని రూ. 25 కోట్లు దాకా బిజినెస్ జరిగే ఛాన్స్ ఉందని తెలియడం విశేషం. ఇలా మొత్తంగా ఇప్పుడు స్పైడర్ బిజినెస్ రూ. 200 కోట్లు అవుతుందని తెలియడం ఇంట్రెస్టింగ్ గా మారింది. ఎందుకంటే, ఇప్పటివరకు తెలుగులో బాహుబలి మినహా ఇంక ఏ సినిమా ఈ రేంజ్ లో బిజినెస్ చేయలేదు. ఈ రేంజ్ లో బిజినెస్ ను స్పైడర్ మేకర్స్ ముందుగానే అంచనా వేశారు కాబట్టే.. విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా రావడానికి ముందుగా అనుకున్న బడ్జెట్ కంటే కొంచెం ఎక్కువే పెట్టారని అంటున్నారు. ఏదిఏమైనా, ఈ సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషలతో పాటు హిందీ, మలయాళ భాషల్లో కూడా ఒకేసారి రిలీజ్ అయ్యేలా కనిపిస్తోన్న స్పైడర్ ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

Follow US