మ‌హేష్ తో అనీల్ రావిపూడి

Last Updated on by

ప‌టాస్, రాజా ది గ్రేట్, సుప్రీం లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ల‌ను తెర‌కెక్కించిన అనీల్ రావిపూడి తాజాగా `ఎఫ్ 2` చిత్రంతో మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్న సంగ‌తి తెలిసిందే. విక్ట‌రీ వెంక‌టేష్, వ‌రుణ్ తేజ్ ల‌కు అదిరిపోయే బ్లాక్ బ‌స్ట‌ర్ ని అందించాడు రావిపూడి. అందుకే ప్ర‌స్తుతం ఈ న‌వ‌త‌రం ద‌ర్శ‌కుడిపై స్టార్ హీరోల్లోనూ ఆస‌క్తి నెల‌కొంది.

ముఖ్యంగా అనీల్ రావిపూడి త‌దుప‌రి ప్రాజెక్టుల‌పై టాలీవుడ్ లో ఆస‌క్తి నెల‌కొంది. ఇప్ప‌టికే త‌న‌వ‌ద్ద బాల‌య్య, మ‌హేష్ కోసం స్క్రిప్టులు ఉన్నాయ‌ని అనీల్ రావిపూడి తెలిపారు. ఆ ఇద్ద‌రికీ సీరియ‌స్ గానే స్క్రిప్టులు ప్రిపేర్ చేస్తున్నాడు. అందులో మ‌హేష్ కి ఓ అద్భుత‌మైన క‌థ‌ను వినిపించ‌బోతున్నాడ‌ట‌. ప్ర‌స్తుతం ఈ స్క్రిప్టు ప్రిపేర‌వుతోంద‌ని తెలుస్తోంది. మ‌హేష్ 25వ సినిమా మ‌హ‌ర్షి త‌ర్వాత 26వ సినిమా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఉంటుంది. సుక్కూ స్క్రిప్టు రెడీ చేసి వినిపించేందుకు రెడీగా ఉన్నాడు. అటుపై 27వ సినిమా అనీల్ రావిపూడితో ఉంటుందా లేదా? అన్న‌ది స్క్రిప్టు డిసైడ్ చేస్తుంది. ఇప్ప‌టికి ఎఫ్ 2 స‌క్సెస్ ని అనీల్ రావిపూడి పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నాడు.

User Comments