మహేష్ భరత్ అనే నేను అప్ డేట్స్

Last Updated on by

ఈ ఉగాదికి ఎన్ని పోస్ట‌ర్లు విడుద‌లైనా.. ఫ‌స్ట్ లుక్కులు విడుద‌లైనా.. టీజ‌ర్లు వ‌చ్చినా హైలైట్ మాత్రం మ‌హేష్ బాబే. ఆయ‌న పంచెక‌ట్టుతో అంద‌ర్నీ పిచ్చెక్కించాడంతే. తెలుగింటి పెద్ద‌రికం అంటే ఏంటో చూపించాడు సూప‌ర్ స్టార్. ఉగాది కానుక‌గా విడుద‌లైన ఈ పోస్ట‌ర్ కు అద్భుత‌మైన స్పంద‌న వ‌స్తుంది. ఇక ప‌నిలో ప‌నిగా భ‌ర‌త్ అనే నేను షూటింగ్ ముచ్చ‌ట్లు కూడా చెప్పాడు నిర్మాత దాన‌య్య‌. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లోనే ఓ గుడి సెట్ లో 100 మంది డాన్స‌ర్లు.. 1000 మంది జూనియ‌ర్ ఆర్టిస్టుల‌తో రాజుసుంద‌రం మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫీలో ఓ పాట చిత్రీక‌రిస్తున్నాడు కొర‌టాల శివ‌. ఈ పాట అనంతరం మార్చ్ 25 నుంచి స్పెయిన్ వెళ్ల‌నున్నారు చిత్ర‌యూనిట్. అక్క‌డే వారం రోజులు ఉండి షూటింగ్ పూర్తి చేసుకుని రానున్నారు. ఈ షెడ్యూల్ తో షూటింగ్ మొత్తం పూర్తికానుంది. ఏప్రిల్ 8న భ‌ర‌త్ అనే నేను ప్రీ రిలీజ్ వేడుక జ‌ర‌గ‌నుంది. 20న సినిమా విడుద‌ల కానుంది. కైరాఅద్వానీ హీరోయిన్. ఈ చిత్రం ఖచ్చితంగా మ‌హేష్ అభిమానుల‌కు పండ‌గే అంటున్నాడు నిర్మాత దాన‌య్య‌. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌హేష్ బాబును ఇలాంటి పాత్ర‌లో చూసుండ‌రు అని.. ఖచ్చితంగా భ‌ర‌త్ అనే నేను కొత్త చ‌రిత్ర‌కు నాందీ ప‌లుకుతుంద‌ని ధీమాగా చెబుతున్నాడు కొర‌టాల శివ. ఈ చిత్రంతో మ‌హేష్ కూడా ఫామ్ లోకి రావాల‌ని చూస్తున్నాడు.

User Comments